దురలవాట్లకు బానిసలుగా చేసే యాంగ్జైటీ.. తేలికగా అధిగమించండిలా..! 

 Tips To Overcome Anxiety - Sakshi

యాంగ్జైటీ అందరిలోనూ ఉంటుంది. ఆఫీస్‌లో అధికారులు నిర్ణయించిన లక్ష్యాలు సాధించలేమేమో అని, చేపట్టిన ఫలానా పని విజయవంతమవుతుందో లేదో అని, ఏదైనా కొత్త ప్రదేశంలో నెగ్గుకువస్తామా అని... ఇలా ప్రతి విషయంలోనూ అందరిలోనూ ఈ యాంగై్జటీ కలుగుతుంది. అయితే అందరిలోనూ కలిగే ఈ భావోద్వేగాలనూ, ఉద్విగ్నతలను కొంతమంది తేలిగ్గా అదుపు చేసుకుంటారుగానీ... మరికొందరు అంత తేలిగ్గా అధిగమించలేరు. దాంతో యాంగై్జటీ వల్ల కలుగుతున్న ఉద్విగ్న స్థితిని ఎలా అదుపు చేయాలో తెలియక కొందరు ఆ స్థితిని అధిగమించడం కోసం తొలుత సిగరెట్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత మరొక దురలవాటైన మద్యం. ఇంకొందరు ఎప్పుడూ పొగాకు నములుతూ ఉండే జర్దా, ఖైనీ, పాన్‌మసాలా వంటివాటికి అలవాటు పడి నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లకు గురవుతుంటారు. 

కొందరు పాత అలవాట్లు వదులుకునేందుకు కొత్త అలవాట్ల బాట పడుతుంటారు. ఇది మరీ ప్రమాదం. ఇది డ్రగ్స్‌ వంటి ప్రమాదకరమైన అలవాట్లకు దారి తీస్తుంది. అలా పొగాకు నమలడం, పొగతాగడం, మద్యంతో పాటు మరికొద్దిమందిలో మాదకద్రవ్యాల వంటి దురలవాట్లకు బానిసలై తమ కాలేయాలూ, మూత్రపిండాలను పాడుచేసుకుంటారు. యాంగ్జైటీని అధిగమించలేకపోగా... చివరకు లివరూ, కిడ్నీలు దెబ్బతింటాయి. ఆరోగ్యమంతా పాడైపోతుంది. అందుకే యాంగై్జటీకి లోనయ్యేవారు, దాన్ని అధిగమించడానికి అన్నిటికంటే మంచిదీ, తేలికైన మార్గం పుస్తకాలతో పరిచయం. పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల... అనేక పరిస్థితులతో మానసికంగా పరిచయం కావడం వల్ల తాము ఎదుర్కొన్న పరిస్థితి పెద్దగా కొత్తగా అనిపించదు. దాంతో యాంగై్జటీ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ. అదేగాక... యోగా, ధాన్యం, మంచి మంచి హాబీల వంటి తేలిక మార్గాలతోనూ అధిగమించవచ్చు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top