105 రోజుల వినోద క్వారంటైన్‌

Telugu Bigg Boss Season 4 starts From 06/09/2020 - Sakshi

కరోనా వచ్చినా, వస్తుందనే సందేహం వచ్చినా క్వారంటైన్‌కి వెళ్లాలి. ఆ క్వారంటైన్‌ పద్నాలుగు రోజులే. కాని పదహారు మంది కంటెస్టెంట్‌లు 105 రోజుల క్వారెంటైన్‌కి వెళ్లే సీజన్‌ వచ్చింది. బిగ్‌బాస్‌ 4 సీజన్‌. ఇక వీరి ఆటలు, పాటలు, తగువులు, తీర్పులు, ఎంట్రీలు, ఎగ్జిట్‌లు అన్నీ ప్రేక్షకులవి కూడా కాబోతున్నాయి. కరోనా చికాకును కాస్తయినా దూరం చేసే భారీ డైలీ డ్రామా బిగ్‌బాస్‌ 4.

కెమెరా కళ్లున్న ఇల్లు. అనుక్షణం నిఘా. ప్రతి కదలికను వెంటాడే చూపు. ప్రవర్తనపై తీర్పు. అంతలోనే స్నేహం. అంతలోనే వైరం. ఇంట్లోకి అడుగు పెడుతుంటే స్వాగతం. వీడ్కోలు తీసుకుంటూ ఉంటే దుఃఖం. స్టార్‌ మాలో ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ షోలో లేని డ్రామా లేదు. అంత వరకూ ముక్కూముఖం అంతా తెలియని వారు, పాత స్నేహం ఉన్నవారు పూర్తిగా కొత్తగా మారి కొత్త జీవితం జీవించడమే ఈ షో విశేషం. అందరి లక్ష్యం ఒక్కటే. అంతిమ విజేతగా నిలవడం. కాని ఆ ప్రయాణం అంత సులువు కాదు. మనుషులను ఓడించి, జయించి, బాధించి, సంతోషపరిచి ఆ స్థానానికి వెళ్లాలి. ప్రతి సందర్భంలోనూ ఒకటే సవాల్‌. లోపల ఉన్న మంచిని బయటకు తేవాలా.. చెడును బయటకు తేవాలా. ఆ ప్రవర్తనకే ఓట్లు పడతాయి. ఆ వ్యక్తిత్వాన్నే ప్రేక్షకులు గెలిపిస్తారు. ఇదంతా ప్రతి రోజూ గుక్క తిప్పుకోనివ్వకుండా కొనసాగుతుంది.

ఈసారి హోస్ట్‌ ఎవరు?
బిగ్‌బాస్‌ షో నిర్వహణ ఎంత ముఖ్యమో హోస్ట్‌ను నియమించడం కూడా అంతే ముఖ్యం. ఎన్‌.టి.ఆర్‌ హోస్ట్‌గా పెద్ద బ్యాంగ్‌తో మొదలైన ఈ షో ఆ తర్వాత నాని, నాగార్జునలతో అదే మీటర్‌ను కొనసాగించింది. బిగ్‌బాస్‌ 4కు మళ్లీ ఎన్‌.టి.ఆర్‌ హోస్ట్‌ కావచ్చన్న వార్తలొచ్చాయి. ఒక దశలో మహేశ్‌బాబు పేరు వినిపించింది. కాని బిగ్‌బాస్‌కు హోస్ట్‌ చేసే చాన్స్‌ మళ్లీ నాగార్జునకే దక్కింది. కరోనా వల్ల సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన నేపథ్యంలో నాగార్జున కూడా మరోసారి ఈ షోను హోస్ట్‌ చేయడం ఒక ఆసక్తికర వృత్తిగత కార్యకలాపంగా భావించి ఉంటారు. నాగార్జున నిర్వహించిన బిగ్‌బాస్‌ 3 విజేతగా గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ నిలిచాడు. ఈసారి ఎవరు నిలుస్తారో చూడాలి.

కంటెస్టెంట్‌లు ఎవరు?
పాల్గొనే వరకు కంటెస్టెంట్‌లు ఎవరు అనే విషయమై సస్పెన్స్‌ ఉంచడం బిగ్‌బాస్‌ షో ఆనవాయితీ. అయితే ఇంతకు ముందు పద్ధతి వేరు. ఇప్పుడు పద్ధతి వేరు. గతంలో కంటెస్టెంట్లను షోకు రెండు మూడు రోజుల ముందు తమ అధీనంలోకి తీసుకునేవారు. కాని ఇప్పుడు కరోనా వల్ల రెండు వారాల ముందు నుంచే వారిని తమ అధీనంలోకి తీసుకోవడం, పరీక్షలు నిర్వహించడం తతిమా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఆగస్టు నెలాఖరుకు టెలికాస్ట్‌ కావాల్సిన షో సెప్టెంబర్‌ 6కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ల పేర్లు కొన్ని బయటకు తెలియసాగాయి. నటుడు తరుణ్, నటి శ్రద్ధా దాస్, గాయని సునీతల పేర్లు మొదట వినిపించినా వారు తమ పార్టిసిపేషన్‌ను కొట్టి పారేశారు. 

ప్రస్తుతానికైతే వార్తల్లో ఉన్న పేర్లు ఇవి–
1. లాస్య మంజునాథ్‌ (టీవీ నటి), 2. మహాతల్లి జాహ్నవి (యూట్యూబర్‌), 3. గంగవ్వ (యూట్యూబర్‌– విలేజ్‌ స్టార్‌), 4.సుజాత (టివి యాంకర్‌), 5.అవినాష్‌ (స్టాండప్‌ కమెడియన్‌), 6. సత్య (న్యూస్‌ రీడర్‌), 7.సుహైల్‌ రెయాన్‌ 8. సూర్యకిరణ్‌ (డైరెక్టర్‌), 9. అభిజిత్‌ (హీరో), 10. అమ్మ రాజశేఖర్‌ (దర్శకుడు).  11. దివి వైద్య (నటి). మిగిలిన ఐదుగురిలో ఇద్దరు హీరోయిన్లు, ఒక మ్యూజిక్‌ చానెల్‌ యాంకర్‌ ఉంటారని తెలుస్తోంది. ఈ 16 మంది కాకుండా అడిషిషనల్‌ కంటెస్టెంట్‌లను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. కరోనా ఆటంకాల వల్ల, ఇతరత్రా ఇబ్బందుల వల్ల వీరిలో ఎవరు పాల్గొంటారో కొత్తగా ఎవరు జతవుతారో ఇవాళ సాయంత్రం తెలిసిపోతుంది.

కత్తి మీద సాము
ఏమైనా ఈసారి బిగ్‌బాస్‌ షో నిర్వహణ కత్తి మీద సాము. గెస్ట్‌లు హౌస్‌లోకి రావాలన్నా, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు హౌస్‌లోకి రావాలన్నా అప్పటికప్పుడు అయ్యే పని కాదు. కరోనా ప్రొటోకాల్‌ను పాటించి చేయాలి. అదీగాక బిగ్‌బాస్‌ షో నిర్వహణ లో కనీసం వంద మంది శ్రమించాల్సి ఉంటుంది. వీరంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే హౌస్‌లో ఉన్నవారికి కూడా కరోనా రావచ్చు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రేక్షకులు ఉత్కంఠగా ఉన్నారన్నది వాస్తవం. ఇల్లు అంతగా కదల్లేని ఈ రోజుల్లో, థియేటర్ల మూసివేత కొనసాగుతున్న ఈ రోజుల్లో ఇంట్లోకి రానున్న వినోదం వారిని ఉల్లాసపరుస్తుందనే ఆశిద్దాం.
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

19-01-2021
Jan 19, 2021, 14:45 IST
ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది.. అని అఖిల్‌, సోహైల్‌ ఏనాడో అనుకున్నారు. అందుకే వీళ్లిద్దరిలో ఎవరు బిగ్‌బాస్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నా మిగిలినవాడికి బైక్‌,...
11-01-2021
Jan 11, 2021, 20:25 IST
'నువ్వు గెలిస్తే నాకు ల్యాప్‌టాప్‌, బైక్‌ కొనివ్వాలి, నేను గెలిస్తే నీక్కూడా ఆ రెండు కొనిపెడతా' ఇది ఎక్కడో విన్నట్లుంది...
09-01-2021
Jan 09, 2021, 10:30 IST
అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్‌ సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్‌-4 సీజన్‌తో ఒక్కసారిగా ఎనలేని గుర్తింపు వచ్చింది. ‘కథ...
29-12-2020
Dec 29, 2020, 00:00 IST
ఇద్దరమ్మాయిలు.. అలేఖ్య హారిక, అరియానా గ్లోరి. ఇద్దరూ బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. అందరి దృష్టిని తమ వైపు నిలుపుకున్నారు. ఇద్దరూ జీవితంలోని...
28-12-2020
Dec 28, 2020, 08:50 IST
బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ విజేతగా మిస్టర్‌ కూల్‌ అభిజిత్‌ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. ఎలాంటి పరిస్థితినైనా డీల్‌ చేయగలిగే నైపుణ్యం, హుందాగా...
27-12-2020
Dec 27, 2020, 11:06 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి...
27-12-2020
Dec 27, 2020, 08:54 IST
హుస్నాబాద్‌: బుల్లితెర వీక్షకులను అలరించిన తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సోహైల్‌కు శనివారం రాత్రి హుస్నాబాద్‌ పట్టణంలో అభిమానులు ఘన...
26-12-2020
Dec 26, 2020, 13:25 IST
మోనాల్‌ గజ్జర్‌.. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పేరు ఇది. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ...
23-12-2020
Dec 23, 2020, 16:11 IST
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లను చూసి జనాలు పెదవి విరిచారు. ముక్కూమొహం తెలీని వాళ్లను హౌస్‌లోకి పంపించారేంటని విమర్శలు గుప్పించారు....
23-12-2020
Dec 23, 2020, 10:39 IST
బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఆటలు, పాటలు, అలకలు, గొడవలు, కోపాలు, బుజ్జగింపులు, ప్రేమ, గాసిప్స్‌...
23-12-2020
Dec 23, 2020, 04:59 IST
బిగ్‌ స్క్రీన్‌లో నటించాలి. బిగ్‌ హౌస్‌లో జీవించాలి. రెండూ తెలిసిన కుర్రాడు అభిజీత్‌. సహజంగానే స్ట్రాంగ్‌. ‘రియాలిటీ’తో.. మరింత స్ట్రాంగ్‌ అయ్యాడు. విజేతగా నిలిచాడు. ‘ఈ...
22-12-2020
Dec 22, 2020, 15:56 IST
అభి-హారికల మధ్య కూడా ఏదో నడుస్తుందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.
22-12-2020
Dec 22, 2020, 14:28 IST
బుల్లితెర ప్రేక్షకులను 106 రోజులపాటు అలరించిన బిగ్‌ రియాల్టీ రియాలిటీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌కు శుభం కార్డు పడింది....
22-12-2020
Dec 22, 2020, 13:39 IST
తెలుగు బుల్లితెరపై 106 రోజులు వినోదాన్ని అందించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 4 డిసెంబర్‌ 20న శుభంకార్డు పడిన విషయం తెలిసిందే....
22-12-2020
Dec 22, 2020, 04:24 IST
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌తో ఉద్యోగంలో చేరి ఉంటే అభిజీత్‌ అనే ఒక నటుడు తెలుగు తెరకు పరిచయమయ్యే వాడే కాదేమో!
21-12-2020
Dec 21, 2020, 11:08 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సేపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ నడుస్తోంది. హౌజ్‌లోనూ, బయట కూడా అతను...
21-12-2020
Dec 21, 2020, 09:16 IST
చిరంజీవి ఎదుట తన మనసులో మాటను సోహైల్‌ బయటపెట్టాడు.
21-12-2020
Dec 21, 2020, 08:32 IST
జీవితంలో మరోసారి బిగ్‌బాస్‌ చూసేది లేదని, కంటెస్టెంట్లకు ఓట్లు వేయమని తెగేసి చెప్తున్నారు.
21-12-2020
Dec 21, 2020, 01:32 IST
సాక్షి, హైదరాబాద్‌: బుల్లితెర వీక్షకులను 106 రోజులపాటు అలరించిన ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌–4 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం ముగిసింది....
21-12-2020
Dec 21, 2020, 00:52 IST
పెద్ద హీరోల‌ది పెద్ద మ‌న‌సని చాటి చెప్పారు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే సాక్షిగా కంటెస్టెంట్ల...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top