ఈ రోజు క్రియేటివ్‌ థియేటర్‌ ప్రదర్శన ..! | Telangana Formation Day: Golla Ramavva Creative Theatre Nampally Hyderabad | Sakshi
Sakshi News home page

ఈ రోజు క్రియేటివ్‌ థియేటర్‌ ప్రదర్శన ..! వేదికగా తెలుగు విశ్వవిద్యాలయం..

Jun 2 2025 10:06 AM | Updated on Jun 2 2025 10:06 AM

Telangana Formation Day:  Golla Ramavva  Creative Theatre Nampally Hyderabad

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, క్రియేటివ్‌ థియేటర్, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో సోమవారం సాయంత్రం 6:45 గంటలకు ‘గొల్ల రామవ్వ’ నాటికను ప్రదర్శించనున్నారు. ఈ నాటికకు మూలకథ స్వర్గీయ భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాసిన ప్రసిద్ధ కథ ‘గొల్ల రామవ్వ’. గ్రామీణ నేపథ్య జీవితాల విశిష్టతను ప్రతిబింబించే

ఈ కథను నాటికగా మలచి ప్రదర్శిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి వేదికగా ఈ కార్యక్రమం జరుగనుంది. క్రియేటివ్‌ థియేటర్‌ వ్యవస్థాపకులు అజయ్‌ మంకెనపల్లి ఆధ్వర్యంలో దీనిని ప్రదర్శించనున్నారు. నాటకరంగ అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ విలక్షణ నాటికను ఆస్వాదించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ నాటికలో తమ సంస్థ నుంచి పలువురు యువ థియేటర్‌ ఆరి్టస్టులు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.  

(చదవండి: క్రేజ్‌ ఫుల్‌.. బోబా బబుల్‌ టీ..! స్పెషాల్టీ ఇదే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement