సిగరెట్స్‌ కంటే వేపింగే డేంజరా? హఠాత్తుగా శరీరం.. | Sakshi
Sakshi News home page

సిగరెట్స్‌ కంటే వేపింగే డేంజరా? హఠాత్తుగా శరీరం..

Published Mon, Jun 10 2024 3:51 PM

Teens Lung Collapses After Vaping Equivalent Of 400 Cigarettes A Week

సిగరెట్స్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి చాలా మంది ఇప్పుడు వేపింగ్ వైపుకి మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా టీనేజర్స్ దీనికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. అలానే ఇక్కడొక యువతి దీనికి అడిక్ట్‌ అయ్యి చావు అంచులదాక వెళ్లి వచ్చింది. అదృష్టంకొద్ది ప్రాణాలతో బయటపడింది. ఆమె సిగరెట్‌ వేపింగ్‌  మాదిరిగా ప్రమాదకరమైనది కాదనుకుని చేజేతులారా ఇంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నానని బాధగా చెప్పింది. అసలేంటి ఈ వేపింగ్‌? సిగరెట్స్‌ కంటే ప్రమాదకరమా..?

యూకేకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి వేపింగ్‌కి అడిక్ట్‌ అయ్యింది. దీంతో ఊపిరితిత్తుల్లో గాయమై ఒక్కసారిగా పనిచేయడం మానేశాయి. ఇది ఆమె సరిగ్గా మే11న తన ‍స్నేహితురాలి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో జరిగింది. నిద్రలోనే శ్వాస సంబంధ సమస్యలతో శరీరం అంతా నీలం రంగంలోకి మారిపోవడం జరిగింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షల్లో న్యూమోథోరాక్స్‌కి గురవ్వడంతో ఊపరితిత్తులు పనిచేయడం మానేశాయని చెప్పారు. 

వెంటనే ఆమెకు ఊపరితిత్తుల భాగాన్ని తొలగించాలని వెల్లడించారు. ఇక్కడ న్యూమోథోరాక్స్‌ అంటే..శరీరంలో సరిగ్గా ఊపిరితిత్తులకు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో గాలి పేరుకుపోయి ఊపరితిత్తులపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో అక్కడ గాయం అయ్యి ఒక్కసారిగా ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి. అలాగే రోగి శరీరం నీలం రంగులోకి మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో రోగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. 

అయితే ఈ టీనేజ్‌ అమ్మాయికి వైద్యులు సుమారు ఐదున్నర గంటల పాటు సర్జరీ చేసి తక్షణమే డ్యామేజ్‌ అయిన ఊపిరితిత్తుల భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. తాను చాలా భయానకమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని, వేపింగ్‌ ఇంత ప్రమాదమని అస్సలు అనుకోలేదని కన్నీటిపర్యతమయ్యింది. ఇక దాని జోలికి వెళ్లనని, జీవితం చాలా విలువైనదని దాన్ని సంతోషభరితంగా చేసుకోవాలని చెబుతోంది. ఇంతకీ ఏంటీ వేపింగ్‌..?

వేపింగ్‌ అంటే..?
బ్యాటరీతో నడిచే ఎలెక్ట్రానిక్ 'ఈ సిగరెట్' పరికరం నుంచి వచ్చే ఆవిరిని పీల్చడాన్ని వేపింగ్ అంటారు. 'ఈ-సిగరెట్స్' బ్యాటరీతో పని చేస్తాయి. మామూలు సిగరెట్స్‌లో పొగాకు మండి పొగ వస్తుంది. ఈ-సిగరెట్స్‌లో పొగాకు, ఫ్లేవర్స్, కెమికల్స్‌తో నిండిన లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్‌ని వేడి చేస్తే పొగ / వేపర్ వస్తుంది. 

ఈ పొగని పీల్చడమే వేపింగ్ అంటే. ఇది సిగరెట్‌ కంటే ప్రమాదకారి కాదు. కానీ దీనిని స్మోకింగ్ మానడానికి ఒక మెట్టుగా మాత్రమే ఉపయోగిస్తారని చెబుతున్నారు నిపుణులు . అయితే ఇది కూడా ఆరోగ్యాని అంత మంచిది కాదనే చెబుతున్నారు. అంతేగాదు వేపింగ్‌ ఎడిక్షన్‌కి గురైతే..బాధితులు ఒక వారానికి 400 సిగరెట్లు సేవించడం వల్ల వచ్చే దుష్ఫరిణాన్ని ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులు

దుష్పలితాలు..
వేపింగ్ ఊపిరితిత్తులని డామేజ్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ని బాడీలోకి రిలీజ్ చేసి కేన్సర్ రావడానికి కారణం అవుతాయి. రోగ నిరోధక శక్తి బాగా బలహీన పడుతుంది. పిల్లలూ, టీనేజ ర్స్‌లో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. స్త్రీలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఈ-సిగరెట్స్ యూజ్ చేస్తే అబార్షన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

(చదవండి: తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..)

 

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement