అదిరిపోయే వీడియో ఎడిటింగ్‌ యాప్స్‌ మీకోసం.. | Super Video Editing Softwares Available | Sakshi
Sakshi News home page

అదిరిపోయే వీడియో ఎడిటింగ్‌ యాప్స్‌ మీకోసం..

Aug 13 2021 12:00 AM | Updated on Aug 13 2021 12:54 AM

Super Video Editing Softwares Available - Sakshi

పిండి కొద్ది రొట్టెలాగే... టెక్నాలజీ కొద్ది వీడియో! టెక్నాలజీతో ‘బొమ్మ అదిరిపోయింది’ అనిపించడానికి బెస్ట్‌ వీడియో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకొని మీ వీడియోలకు సాన పెడితే ‘శబ్భాష్‌’ అనిపించుకోవడం ఎంతసేపని!

వీడియో ఎడిటింగ్‌కు మీరు కొత్త అయితే ‘ఎడోబ్‌ ప్రీమియర్‌ ఎలిమెంట్స్‌’ బెటర్‌. ‘క్రియేట్‌ - ఎడిట్‌- ఆర్గనైజ్‌ -షేర్‌ యువర్‌ వీడియోస్‌’ అంటున్న ఎడోబ్‌ ప్రీమియర్‌ ఎలిమెంట్స్‌కు ఈజీ వీడియో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌గా పేరుంది. స్టెప్‌-బై-స్టెప్‌ తెలుసుకోవచ్చు. సెకండ్ల వ్యవధిలో వీడియోలను షార్ప్‌గా తీర్చిదిద్దవచ్చు. పర్‌ఫెక్ట్‌లెంత్‌తో మ్యూజిక్‌ను సెట్‌ చేయవచ్చు. ‘ఫైనల్‌ కట్‌ ప్రో’ను ప్రొఫెషనల్‌ టూల్‌గా చెబుతుంటారు. టాప్‌ యూట్యూబర్స్‌ దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. లాంగ్‌ టర్మ్‌ యూట్యూబర్స్‌కు ఎక్కువగా ఉపయోగపడే ‘ఫైనల్‌ కట్‌’లో ఫిల్టర్స్, మల్టీఛానెల్‌ ఆడియో టూల్స్, అడ్వాన్స్‌డ్‌ కలర్‌ గ్రేడింగ్‌ ఫీచర్లు ఉన్నాయి.

మొబైల్‌ఫోన్‌ ఉపయోగించే సోషల్‌ మీడియా వీడియో క్రియేటర్స్‌ కోసం ‘ఎడోబ్‌ యాప్‌ ప్రీమియర్‌ రష్‌’ ఉపయోగపడుతుంది. వాయిస్‌ అండ్‌ మ్యూజిక్‌ మధ్య సౌండ్‌ లెవెల్స్‌ను బ్యాలెన్స్‌ చేసే ‘ఆటో డకింగ్‌’ సదుపాయం అందుబాటులో ఉంది. ఆకట్టుకునే మోషన్‌ గ్రాఫిక్‌ టెంప్లెట్స్‌ ఉన్నాయి. ‘షాట్‌కట్‌’ సాఫ్ట్‌వేర్‌తో సులభంగా వీడియోలు ఎడిట్‌ చేయవచ్చు. ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మెరుగైన వీడియో, ఆడియో టూల్స్, 4కే లాంటి వైడ్‌రేంజ్‌ ఫార్మట్స్‌ ఉన్నాయి.



‘వీమియో’ అనేది బెస్ట్‌ ఏఐ-అసిస్టెడ్‌ ఆన్‌లైన్‌ వీడియో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ అనిపించుకుంది. వేలాది ఫోటోలు, వీడియోలు ఉన్న స్టాక్‌లైబ్రరీతో యాక్సెస్‌ కావచ్చు, లైసెన్స్‌డ్‌ మ్యూజిక్‌ లైబ్రరీ ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను వాడుకోవచ్చు. ‘ఇన్‌వీడియో’ అనేది ఆన్‌లైన్‌ వీడియో ఎడిటింగ్‌ ప్లాట్‌ఫామ్‌. సోషల్‌ మీడియా కోసం మాత్రమే కాకుండా కంపెనీ వెబ్‌సైట్‌ల కోసం ఆకట్టుకునేలా వీడియోలు క్రియేట్‌ చేయవచ్చు. అయిదువేలకు పైగా ప్రీ-మేడ్‌ టెంప్లెట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఫ్రీస్టాక్‌ లైబ్రరీ నుంచి ఫోటో,వీడియోలు,మ్యూజిక్‌ను ఉపయోగించవచ్చు. టెక్స్‌ - టు - వీడియో టూల్‌లాంటి స్రై్టకింగ్‌ ఫీచర్లు ఉన్నాయి.

‘వుయ్‌వీడియో’ అనేది క్లౌడ్-బేస్డ్‌ ఆన్‌లైన్‌ ఎడిటర్‌. స్టాక్‌వీడియో లైబ్రరీ నుంచి వేలాది ఇమెజెస్, వీడియోలు, మ్యూజిక్‌తో యాక్సెస్‌ కావచ్చు. గ్రీన్‌స్క్రీన్, స్క్రీన్‌ రికార్డింగ్, కలర్‌గ్రేడింగ్‌... మొదలైన అడ్వాన్స్‌డ్‌ ఎడిటింగ్‌ టూల్స్‌తో వీడియోలకు సినిమాటిక్‌ లుక్‌ ఇవ్వొచ్చు. స్లైడ్‌షోలు,ప్రచారయాత్రలతో పాటు సోషల్‌ మీడియాలో మార్కెటింగ్‌ వీడియోలు క్రియేట్‌ చేయడానికి పర్‌ఫెక్ట్‌ వీడియో మేకర్‌  బైటబుల్‌. స్టన్నింగ్‌ టెంప్లెట్స్‌ దీని సొంతం. వీడియోలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడానికి హై రిజల్యూషన్‌తో కూడిన ఫోటోలు, స్టాక్‌వీడియోలు ఉన్నాయి. ఇక మీరు రెడియా!

త్రినేత్రం
అనుభవాన్ని మించిన జ్ఞానం ఏంఉంటుంది! తన అపారమైన అనుభవంతో అమెరికన్‌ ఫిల్మ్‌ఎడిటర్, డైరెక్టర్, సౌండ్‌ డిజైనర్‌ వాల్టర్‌ మర్చ్‌  ‘ఇన్‌ ది బ్లింక్‌ ఆఫ్‌ యాన్‌ ఐ’  అనే మంచి పుస్తకం రాశారు. వీడియో లేదా ఫిల్మ్‌ ఎడిటింగ్‌కు సంబంధించి బోలెడు విషయాలు తెలుసుకోవచ్చు. డిజిటల్‌ ఎడిటింగ్‌లో వచ్చిన మార్పులు, డిజిటల్‌ ఎడిటింగ్‌ ఉపయోగాలు, పరిమితులు...మొదలైనవి తెలుసుకోవడానికి ఉపయోగపడే పుస్తకం ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement