Poha Banana Shake: ఫైబర్‌, ఐరన్‌ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్‌ తాగితే!

Summer Drinks: Poha Banana Shake Health Benefits In Telugu - Sakshi

పోహా బనానా షేక్‌ 

Summer Drinks- Poha Banana Shake Recipe: అటుకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఆహారం మంచిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వీటితో తయారు చేసే పోహా బనానా షేక్‌లో ప్రోబయోటిక్స్, ఆరోగ్యవంతమైన కార్బొహైడ్రేట్స్‌ తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టని తేలిగ్గా ఉంచుతాయి. ఐరన్‌ కూడా అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడదు.

వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియంలు అధికంగా ఉన్న ఈ జ్యూస్‌ తాగితే దాహం తీరడంతోపాటు, కడుపునిండిన భావనతో ఆకలి త్వరగా వేయదు.  

పోహా బనానా షేక్‌ తయారీకి కావలసినవి: అటుకులు – పావు కప్పు(శుభ్రంగా కడిగి పదిహేను నిమిషాలపాటు నానబెట్టుకోవాలి), అరటిపండ్లు – రెండు ( తొక్కతీసి ముక్కలుగా తరుక్కోవాలి), తియ్యటి పెరుగు – అరకప్పు,  చల్లటి పాలు – ఒకటిన్నర కప్పులు. 

తయారీ:
బ్లెండర్‌లో అరటిపండు ముక్కలు, నానబెట్టిన అటుకులను వేయాలి.
దీనిలో పెరుగు, చల్లటి పాలు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి సర్వ్‌ చేసుకోవాలి.
పంచదార వేయకుండా తయారు చేసిన జ్యూస్‌ కాబట్టి దీనిని డయాబెటీస్‌ ఉన్నవారు కూడా తాగవచ్చు.

చదవండి: Healthy Weight Gain Tips: గుడ్లు, బెల్లం, తేనె, అవకాడో.. పిల్లలకు వీటిని తినిపిస్తే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top