ప్రేమ కోసం ప్రేమగా

A Story About Love from Potturi Vijayalakshmi - Sakshi

ధనం వృద్ధి ΄పొందటానికి కొంత సమయం పడుతుంది. విత్తనాన్ని భూమిలో నాటితే ఫలం చేతికి అందటానికి సమయం పడుతుంది,  కానీ క్షణంలో ఫలితాన్ని అందజేసేది ప్రేమ ఒక్కటే.

ప్రేమతో కూడిన ఒక్క మాట, ఒక చర్య అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ ప్రేమకు వయసుతో పనిలేదు. రక్తసంబంధం ఉండాలని నియమం లేదు. కుల మతాల ప్రసక్తే లేదు.మరో గొప్ప విషయం ఏమిటీ అంటే ఇచ్చేవారికీ, పుచ్చుకునే వారికీ సంతోషం కలిగించే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది. ఒక్కసారి ప్రేమ గొప్పతనం అర్థం అయ్యాక, ప్రేమను పంచటంలోని మాధుర్యం అనుభవం అయిన తరువాత కఠినంగా కఠోరంగా ఉండటం సాధ్యం కాదు. పరిస్థితుల దృష్ట్యా కొన్నిసార్లు కావాలని కఠినంగా ఉండాలని ప్రయత్నించినా రాతి అడుగున దాగిన నీటి బుగ్గలాగా పెల్లుబికి వస్తుంది ప్రేమ. మట్టితో కూడిన చెరువు నీటికుండలో చిన్న పటిక ముక్క వేస్తే మట్టి విడిపో యి స్వచ్ఛమైన నీరు తయారవుతుంది.

అనేక సమస్యలు, ఒత్తిడులతో మనశ్శాంతికి దూరం అయిపో తున్న నేటి సమాజంలో శాంతిని చేకూర్చగల ఏకైక మార్గం ప్రేమ. కేవలం యువతీ యువకుల మధ్య కలిగేదే ప్రేమ అనే భ్రమ నుంచి బయటపడితే ప్రతిజీవి తోటి వారి అందరిపట్ల పశుపక్ష్యాదుల పట్ల, ప్రకృతి పట్ల చూపించేది అంతా ప్రేమే. ఒక కర్మాగారం చాలా చిక్కు సమస్యలలో మునిగి పో యింది. కార్మికుల మధ్య తగులాటలు, శత్రుత్వాలు. అప్పటివరకు ఉన్న అధికారి ఆ ఒత్తిడిని తట్టుకోలేక పదవికి రాజీనామా చేసి వెళ్లిపో యాడు. అతని స్థానంలో మరొక అధికారిని నియమించారు. కొద్దికాలంలోనే కర్మాగారం పరిస్థితి చక్కబడింది.

మునుపటి  శత్రుత్వం నిండిన వాతావరణం మారిపో యి చక్కని వాతావరణం ఏర్పడింది. పైవారు కొత్త అధికారిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇటువంటి మార్పు కోసం ఆ కొత్త అధికారి ఉపయోగించిన ఏకైక ఆయుధం ప్రేమ. ఉదయం రాగానే అందరినీ ఒక్కొక్కరినీ పిలిచి ప్రేమగా పలకరించేవాడు. వారి యోగక్షేమాలను విచారించేవాడు. మీకు ఏ కష్టం వచ్చినా చెప్పండి నేను ఉన్నాను. మనందరం ఒక కుటుంబం అని ప్రేమగా మాట్లాడేవాడు. ఆ చిన్న పని వల్ల ఆయన అందరికీ ఆత్మీయుడిగా మారిపో యాడు.ఆయన సంతోషం కోసం అందరూ గొడవలు మానేసి పరస్పరం స్నేహంగా ఉండటంప్రా రంభించారు.

మనం ప్రస్తుతం నివసిస్తున్న ఈ సమాజంలోఅన్నీ వుండి కూడా కాస్తంత ప్రేమ కోసం అలమటించే వారు ఎందరో ఉన్నారు. అయిన వారందరూ దూర్రప్రాం తాలకు తరలిపో గా ఒంటరితనంతో బాధపడుతూ కాస్తంత ఆప్యాయత కోసం, తపించి పో యే వారికి ఊరట కలిగేలా మనకు ఉన్న సమయంలో కొద్ది సమయం ఇటువంటి వారికోసం కేటాయించి ప్రేమతో నాలుగు మాటలు మాట్లాడితే వారికి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. జీవితం పట్ల ఆసక్తి నశించిపో యి జీవించే వారికి జీవితం పట్ల ఆసక్తి కలుగుతుంది. అంతేకాదు, ప్రేమను చవిచూసిన వారు ఇతరులకు ప్రేమను పంచగలుగుతారు. మన దైనందిన జీవితంలో మనకు సేవలందించే వారిపట్ల ప్రేమతో నాలుగు మంచి మాటలు మాట్లాడితే, వారంతా మనకు మరింత దగ్గరవుతారు. వారితోపాటు మన జీవితం కూడా ఆనందమయంగా మారుతుంది.

– పొత్తూరి విజయలక్ష్మి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top