నలభై గంటలు, నాలుగు వేలసార్లు క్లిక్‌..చివరికి ఆ అద్భుతం! | Stan Bouman Waving Squirrel Won Sony World Photography Award | Sakshi
Sakshi News home page

నలభై గంటలు, నాలుగు వేలసార్లు క్లిక్‌..చివరికి ఆ అద్భుతం!

Apr 19 2026 2:30 PM | Updated on Apr 19 2026 2:39 PM

Stan Bouman Waving Squirrel Won Sony World Photography Award

తకిట తధిమి తకిట తధిమి తందానా పదహేల మొండిమాను వేదికపై ఉడుతగారి నృత్యలీల అమెరికా–కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన డచ్‌ ఫొటోగ్రాఫర్‌ స్టాన్‌ బౌమన్‌ కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం ఇది. సోనీ వరల్డ్‌ ఫొటోగ్రఫీ అవార్డ్స్‌–2026 బహుమతి గెలుచుకున్న ఈ ఫొటో కోసం బౌమన్‌ ఏకంగా నలభై గంటలు శ్రమించి, దాదాపు నాలుగువేల సార్లు కెమెరాను క్లిక్‌మనిపించాడు. 

చివరకు ఉడుత ప్రదర్శించిన ఈ అద్భుత భంగిమను కెమెరాలో బంధించగలిగాడు. కాగా, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సింగిల్ ఇమేజ్‌లకు బహుమతులు ప్రధానం చేస్తారు. ఈ పోటీలో ప్రవేశం ఉచితం. అలాగే గరిష్టంగా మూడు సింగిల్ చిత్రాలను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. జేతగా నిలిచిన ఒకరికి ' ఓపెన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్' బిరుదు లభిస్తుంది కూడా. 

(చదవండి: ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా సాధ్వి సతీష్‌ సైల్‌)
 

Advertisement
 
Advertisement
Advertisement