అందులో అలా... ఇప్పుడు ఇలా | Sakshi
Sakshi News home page

అందులో అలా... ఇప్పుడు ఇలా

Published Sun, Jun 25 2023 12:21 AM

Simpsons, prediction of Titanic sub had movie inspiration - Sakshi

సముద్రగర్భంలో టైటానిక్‌ శిథిలాలను చూడడానికి ‘టైటాన్‌’ అనే జలాంతర్గామిలో వెళ్లిన అయిదుగురు సాహసికుల ప్రయాణం విషాదాంతం అయిన నేపథ్యంలో యానిమేటెడ్‌ సిట్కాం ‘ది సింప్సన్‌’ లోని చిత్రాలు అంతర్జాలంలో వైరల్‌ అవుతున్నాయి. దీనికి కారణం...

2006లో వచ్చిన ‘ది సింప్సన్‌’ సీజన్‌ 17లోని పదో ఎపిసోడ్‌లో హీరో హోమర్‌ సింప్సన్‌ తన తండ్రి మాసన్‌తో కలిసి జలాంతర్గామిలో సముద్రగర్భంలోకి వెళతాడు. ఒకచోట నిధులతో కూడిన శిథిలమైన నావ కనిపిస్తుంది. ఆ తరువాత వీరి జలాంతర్గామి పగడపు దిబ్బల మధ్యలో చిక్కుకు పోతుంది. మరోవైపు జలాంతర్గామిలో ‘లో ఆక్సిజన్‌’ సైన్‌ ఫ్లాష్‌ అవుతుంటుంది. ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తండ్రీకొడుకులు బయటపడతారు.

‘ది సింప్సన్స్‌’లోని తండ్రీకొడుకులు మాసన్, హోమర్‌ సింప్సన్‌లను, టైటాన్‌లో ప్రయాణించిన తండ్రీకొడుకులు షెహ్‌జాదా దావూద్, సులేమాన్‌ దావూద్‌లతో పోల్చి నెటిజనులు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘ది సింప్సన్‌’ రచయిత మైక్‌ రీస్‌ టైటానిక్‌ శిథిలాలను చూడడానికి గత సంవత్సరం భార్యతో కలిసి సముద్ర గర్భంలోకి వెళ్లివచ్చాడు. వారు ప్రయాణించిన జలాంతర్గామిలో కొద్ది సమయం పాటు కమ్యూనికేషన్‌ సమస్యలు వచ్చినా ఆ తరువాత సర్దుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement