బరువు తగ్గడం అనేది అత్యంత కష్టమైన సవాలుగా భావిస్తుంటారు చాలామంది. అలాంటిది ఆరు పదుల వయసులో వెయిట్‌లాస్‌కు ఉపక్రమించి సక్సెస్ అందుకుంది ఈ మహిళ. అది కూడా మూడు నెలల్లో తగ్గి వయసు కేవలం సంఖ్య మాత్రమే అని ప్రూవ్ చేసింది. ఒత్తిడితో కూడిన వృత్తిజీవితాన్ని హ్యాండిల్ చేస్తూ..బరువు తగ్గడం విశేషం. మరి అంతలా స్లిమ్‌గా మారిన ఆ మహిళ ఫిట్‌నెస్ మంత్రా ఏంటో చూద్దామా..!.
కెరీర్ కోచ్ అయిన క్రిస్ బోయెట్చెర్ తాను ఫిట్‌నెస్‌కి వయసు ఎప్పుడు అడ్డంకి కాదని నిరూపించడానికే ఈ వెయిట్‌లాస్ జర్నీకి ఉపక్రమించినట్లు తెలిపారు. ఇంతకుమునుపు పని నిమిత్తం జర్నీలు, ఎక్కువ గంటల పని, తదితరాలతో బిజీగా గడిపి, ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. అందుకే తన జీవితానికి అనుకూలమైన వ్యవస్థకు కట్టుబడి ఉండాలని డిసైడ్ అయ్యానని అంటోంది.
అలా మూడు నెలల్లో తన శరీరాకృతిని మార్చుకోగలిగానని అంటోంది. ఆ క్రమంలో దశాబ్దాలుగా అనుభూతి చెందని బలాన్ని తిరిగి పొందగలిగానని చెబుతోంది. తనకు ఎంత తీరిక లేని దినచర్యతో ఉన్నప్పటికీ, క్రమబద్ధమైన ప్లాన్‌ని మిస్ చేయలేదట. ఇన్నాళ్లు ఆత్యానూన్యత భావంతో ఉన్న అధిక బరువుని..సక్రమమైన జీవనశైలితో చెక్‌పెట్టి స్లిమ్‌గా మారినిట్లు చెబుతోంది.
అలా 73 కిలోల నుంచి 66 కిలోలకు అనూహ్యంగా తగ్గిపోయానని అంటోంది. అలాగే తానేమి కఠినమైన త్యాగాలు చేయలేదని, తన వాస్తవిక జీవితానికి అనుకూలమైన, నిర్వహించదగిన జీవనశైలిని ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆ ప్రణాళిక పక్కాగా ఫాలో అయ్యేలా కేర్ తీసుకున్నానని, దాంతో నాజూకుగా మారి ఆత్మవిశ్వాసంతో అందరి ముందుకు రాగలిగానని అంటోంది.
నెటిజన్లు సైతం ఆమె రూపు రేఖల్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఎన్ని దశాబ్దాలు జీవించినా సరైన జీవన విధానం, నిరంతర కృషి, బలం, ఆత్మవిశ్వాసంతో మొత్తం ఆరోగ్యాన్ని ఇట్టే మార్చుకోగలరని ప్రూవ్‌చేసింది, స్ఫూర్తిదాయకంగా నిలిచింది మేరీ అంటూ పోస్టులు పెడుతున్నారు.
Mary is a 62 year old administrator.
She thought she would never lose the belly fat and build strength at her age.
Mary was beginning to believe "I'm too old for that." But she decided to try anyway.
She was dealing with travel for work, long hours, and the belief that her… pic.twitter.com/atZvUZgTnO— Chris Boettcher (@chrisboettcher9) February 16, 2026
(చదవండి: మూడు వేల ఏళ్లనాటి పురాతన తైలం..! నలుపుదనాన్ని తొలగించి..)


