మొటిమల ముల్లుకు మొటిమలతోనే విరుగుడు! | Sakshi
Sakshi News home page

మొటిమల ముల్లుకు మొటిమలతోనే విరుగుడు!

Published Fri, Feb 9 2024 11:50 AM

Scientists Engineer Skin Bacteria For Breakthrough Acne - Sakshi

టీనేజర్లను బాగా వేధించే సమస్య మొటిమలు. ముఖంపై చిన్న బొడిపెల మాదిరిగా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కొసారి వాటి నుంచి జిడ్డుగా ఉండే ఒక రకమైన ద్రవం కారుతుంది. గిల్లడం వల్ల ముఖంపై ఎర్రటి పొక్కుల్ల అసహ్యంగా కనిపిస్తాయి. ఓ పట్టాన తగ్గవు. ఇంతవరకు మొటిమలు తగ్గేందుకు యాంటీ బయోటిక్‌ మందులతో చికిత్స అందిస్తున్నాం. అవి కేవలం మొటిమలు రావడానికి కారణమయ్యే సెబమ్‌ అనే జిడ్డుని ఉత్పత్తి చేసే కణాలతో పోరాడేవి లేదా నాశనం చేసేవి. నిజం  చెప్పాలంటే ఆ ఔషధాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకునే చికిత్స​ చేసేవారు వైద్యులు. అయితే ఆ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియానే మనకు మేలు చేసేలా మారిస్తే..! అనే సరికొత్త అధ్యయానికి నాంది పలికారు స్పెయిన్‌ శాస్త్రవేత్తలు. 

ఈ మేరకు పాంప్యూ ఫాబ్రా విశ్వవిద్యాలయం(యూపీఎఫ్‌) శాస్త్రవేత్తలు మొటిమల మందులలో క్రియాశీల పదార్థాలు ఉత్పత్తి అయ్యేలా చర్మంలో ఉండే బ్యాక్టీరియాను ఎలా ఇంజనీర్‌ చేయాలనే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. మొట్టిమలకు కారణమయ్యే క్యూటిబాక్టిరియాని రిపేర్‌ చేయడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ బ్యాక్టీరియా మన చర్మంపై ఉండే వెంట్రుకల కుదుళ్లలో లోతుగా నివశిస్తుంది. ఇది సెబమ్‌ అనే ఒక విధమైన జిడ్డు అధికంగా ఉత్పత్తి చేసి మొటిమలు వచ్చేందుకు  కారణమవుతోంది. అందువల్ల వైద్యులు ఆ జిడ్డుని ఉత్పత్తి చేసే కణాలను చంపేలే ట్రీట్‌మెంట్‌ చేసేవారు.

ఇప్పుడూ ఆ  సెబమ్‌ అనే జిడ్డు తక్కువగా ఉత్పత్తి చేసేలా చర్మంలోని బ్యాక్టీరియాని మార్చే టెక్నిక్‌ని అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసం మానవ చర్మ కణాల్లోని బ్యాక్టీరియాను ల్యాబ్‌లో పరీక్షించగా మెటిమలను రాకుండా చేసే ఎన్‌జీఏఎల్‌ అనే ప్రోటీన్‌ను కూడా స్రవించగలదని గుర్తించారు. దీంతో ఆ బ్యాక్టీరియాతోనే ముఖంపై ఏర్పడే జిడ్డు ఉత్పత్తికి కారణమ్యే సెబమ్‌ ఉత్పత్తిని నియంత్రించొచ్చని కనుగొన్నారు. దీన్ని ఎలుకలపై ప్రయోగించగా.. ఆ బ్యాక్టీరియా ఎలుకల్లో జీవించగులుగుతుందని గుర్తించారు. ఆ విధానం పనిచేస్తుంది కానీ మొటిమల ప్రభావాల గురించి ఎలుకలపై ప్రయోగించి తెలుసుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే? ఎలుక చర్మం మానవ చర్మాని కంటే విభిన్నంగా ఉంటుంది. కచ్చితంగా మనుషులపైనే ఈ టెక్నిక్‌ ట్రయల్స్‌  నిర్వహించక తప్పదు.

అయితే ఈ టెక్నిక్‌ని తొలుత త్రీడీ స్కిన్‌ మోడల్‌లో ప్రయత్నిస్తే బెటర్‌ అని భావిస్తున్నారు. ఎందుకంటే? అన్ని రకాల చర్మ పరిస్థితులకు ఈ విధానం అనువుగా ఉంటుంది. అదే సమయంలో మానువులపై ట్రయల్స్‌ నిర్వహించేందకు మరింత లోతుగా ఈ టెక్నిక్‌పై పరిశోధనుల చేయాల్సి ఉందని కూడా చెప్పారు పరిశోధకులు. అలాగే తాము ఈ బ్యాక్టీరియాను వివిధ రకాల చర్మ వ్యాధులకు కూడా మేలు చేసేలా మార్చేలా ఆ టెక్నిక్‌ని అభివృద్ధిపరచనున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. అంతేగాక మొటిమల నివారణకు మొటిమలనే ఉపయోగించడంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు కూడా తెలిపారు. 

(చదవడం: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!)

 
Advertisement
 
Advertisement