Best Sweet Recipe: ఎప్పుడూ సేమ్యా పాయసమేనా? ఈసారి... శనగపప్పు పాయసం ఇలా..

Sankranti 2023 Special: Senagapappu Payasam Recipe - Sakshi

ఎంత ఈజీ అయితే మాత్రం... ఎప్పుడూ సేమ్యా పాయసమేనా? ఈసారి... పండుగకు శనగపప్పు పాయసం చేద్దాం.
శనగపప్పు పాయసం తయారీకి కావలసినవి:
►పచ్చి శనగపప్పు – 200 గ్రా
►కొబ్బరి పాలు లేదా గేదెపాలు– 100 మి. లీ
►బెల్లం తురుము – 150 గ్రా;

►నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్‌లు
►జీడిపప్పు – 20
►కిస్‌మిస్‌ – టేబుల్‌ స్పూన్‌
►ఏలకుల పొడి – అర టీ స్పూన్‌.

తయారీ:
►శనగపప్పును కడిగి పది నిమిషాలు నానబెట్టిన తర్వాత రెండింతలు నీటిని పోసి ప్రెషర్‌ కుక్కర్‌లో నాలుగైదు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.
►పాలను మరిగించి పక్కన ఉంచాలి.
►కుక్కర్‌ వేడి తగ్గిన తర్వాత శనగపప్పును ఒక మోస్తరుగా మెదపాలి (మరీ మెత్తగా చేయరాదు).
►వెడల్పాటి బాణలి పెట్టి అందులో మెదిపిన శనగపప్పు వేసి పాలు పోసి కలుపుతూ మరిగించాలి.

►మిశ్రమంలో బుడగలు వచ్చేటప్పుడు బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి సన్న మంట మీద (పెద్ద మంట చేస్తే పాయసం అడుగు పడుతుంది) కలుపుతూ ఉడికించాలి. మరొక స్టవ్‌ మీద పెనం పెట్టి నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించాలి.
►వీటిని ఉడుకుతున్న పాయసంలో వేసి కలిపి దించేయాలి.
గమనిక: వీగన్‌ డైట్‌ను అనుసరించేవాళ్లు యానిమల్‌ మిల్క్‌కి చదువుగా కొబ్బరిపాలతో, నెయ్యికి బదులుగా వంట కొబ్బరి నూనెతో చేసుకోవచ్చు. 

ఇవి కూడా ట్రై చేయండి: Capsicum Bajji Recipe: రుచికరమైన క్యాప్సికమ్‌ బజ్జీ తయారీ ఇలా..
Sankranti- Recipes: అరిశెలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి! ఇక పూతరేకులు..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top