Upma Bonda Recipe In Telugu: ఉప్మా మిగిలిపోయిందా.. ఇలా రుచికరమైన బోండాలు చేసుకోండి!

Recipes In Telugu: How To Prepare Upma Bonda - Sakshi

Recipes In Telugu- Upma Bonda: కొంతమందికి ఉప్మా తినడం పెద్దగా ఇష్టం ఉండదు. అలాంటి వాళ్లకు రుచికరమైన ఉప్మా బోండా చేసిపెడితే బాగుంటుంది. నిజానికి ఉప్మా మిగిలిపోయినపుడు ఈ రెసిపీ చేసుకుంటే వెరైటీకి వెరైటీ..  రుచికి రుచి కూడా!

ఉప్మా బోండా తయారీకి కావలసినవి:
►ఉప్మా – ఒకటిన్నర కప్పులు ( నచ్చిన ఫ్లేవర్‌లో.. నచ్చిన విధంగా చేసుకోవచ్చు.. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి)
►శనగపిండి – ఒక కప్పు, బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, బేకింగ్‌ సోడా – పావు టీ స్పూన్‌
►కారం, వాము – అర టీ స్పూన్‌ చొప్పున, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

ఉప్మా బోండా తయారీ విధానం:
►ముందుగా శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్‌ సోడా, కారం, వాము (నలిపి వేసుకోవాలి), ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. ఉండలు లేకుండా తోపు సిద్ధం చేసుకోవాలి. 
►అభిరుచిని బట్టి పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, కరివేపాకు వంటివి అందులో కలుపుకోవచ్చు.
►అనంతరం ఉప్మా ఉండల్ని ఆ తోపులో రెండు మూడు సార్లు ముంచి.. నూనెలో దోరగా వేయించుకోవాలి.
►వేడివేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటాయి. 

చదవండి👉🏾Green Dosalu Recipe: గోధుమ పిండి, మినప్పప్పుతో రుచికరమైన గ్రీన్‌ దోసెలు! సాస్‌తో తింటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top