Chatpattey Coconut Recipe: క్రంచీ.. కరకరలు.. చట్‌పటే కోకోనట్‌, బటాడా వడ తయారీ ఇలా!

Recipes In Telugu: How To Make Chatpattey Coconut And Batata Vada - Sakshi

ఎప్పుడూ చేసుకునే పకోడి, పునుగులు, బజ్జీలు, వడలు కాకుండా.. దుంపలు, పాలకూర, గుడ్లతో విభిన్నంగా ప్రయత్నించి చూడండి. నోరూరించే క్రంచీ కరకరలు మళ్లీమళ్లీ కావాలనిపిస్తాయి. వీటిని ఎలా చేయాలో చూసేద్దామా మరి... 

చట్‌పటే కోకోనట్‌
కావలసినవి:
క్యారట్లు – మూడు
బంగాళ దుంపలు – రెండు
పాలకూర – కట్ట
కొత్తిమీర – చిన్నకట్ట ఒకటి
పచ్చిమిర్చి – మూడు
కారం – టీస్పూను
మిరియాలపొడి – టీస్పూను
మెంతిపొడి – టీస్పూను
మైదా – ముప్పావు కప్పు
పచ్చికొబ్బరి తురుము – రెండు కప్పులు
గుడ్లు – మూడు
నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. 

తయారీ:  
ముందుగా కూరగాయ ముక్కలన్నింటిని ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి
ఈ మిశ్రమంలో కారం, మిరియాలపొడి, మెంతిపొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలిపి కబాబ్స్‌లా వత్తుకోవాలి
గుడ్లసొనను ఒక గిన్నెలో వేసి బీట్‌ చేసి పెట్టుకోవాలి
ఇప్పుడు కబాబ్స్‌ను ముందుగా గుడ్లసొనలో ముంచి తరువాత మైదా, చివరిగా కొబ్బరి తురుములో ముంచి సన్నని మంటమీద గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి పీనట్‌ సాస్‌తో సర్వ్‌ చేసుకోవాలి. 

బటాడా వడ
కావలసినవి:
బంగాళ దుంపలు – పావు కేజీ
పచ్చిమిర్చి – రెండు,
అల్లం – అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – పావు టీస్పూను
పంచదార – ముప్పావు టీస్పూను
నూనె – టేబుల్‌ స్పూను
ఆవాలు – అరటీస్పూను

జీలకర్ర – అరటీస్పూను
పసుపు – పావు టీస్పూను
ఇంగువ – చిటికెడు
కరివేపాకు – రెండు రెమ్మలు
నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా.
బ్యాటర్‌ కోసం: శనగపిండి – కప్పు, పసుపు – పావు టీస్పూను, కారం – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, బేకింగ్‌ సోడా – చిటికెడు, 

తయారీ:
బంగాళ దుంపలను ఉడికించి తొక్క తీసుకోవాలి. ఒక గిన్నెలో వేసి కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి మెత్తగా చిదుముకుని పక్కన పెట్టుకోవాలి
పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా నీళ్లు వేసుకుని పేస్టుచేసి పెట్టుకోవాలి

స్టవ్‌ మీద బాణలి పెట్టి టేబుల్‌ స్పూను నూనె వేయాలి.
వేడెక్కిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపడలానివ్వాలి.
తరువాత పసుపు, చిటికెడు ఇంగువ వేసి కలపాలి  తిప్పిన వెంటనే పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి

ఇవన్నీ చక్కగా వేగాక చిదిమిపెట్టుకున్న దుంపల మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి
చివరిగా నిమ్మరసం, పంచదార వేసి నిమిషం పాటు మగ్గనిచ్చి దించేయాలి
ఈ మిశ్రమం చల్లారాక  ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి

బ్యాటర్‌ కోసం తీసుకున్న పదార్థాలన్నింటిని గిన్నెలో వేసి కాసిన్ని నీళ్లుపోసుకుని గరిటజారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి
దుంపల ఉండలను బ్యాటర్లో ముంచి లేతబంగారు వర్ణంలోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి సర్వ్‌ చేసుకోవాలి.
వేయించిన పచ్చిమిర్చి, కొబ్బరి చట్నీతో ఈ వడలు చాలా బావుంటాయి. 

ఇవి కూడా ట్రై చేయండి: Corn Palak Pakoda Recipe: స్వీట్‌ కార్న్‌, పాలకూర.. కార్న్‌ పాలక్‌ పకోడి ఇలా తయారు చేసుకోండి!
దాల్‌ బనానా ఖీర్‌, కలాకండ్‌ లడ్డూ తయారీ ఇలా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top