అత్యంత అరుదైన ఘటన!ఒకేసారి రెండు గర్భాలా..!:

Rare Condition: Woman With 2 Uteruses Pregnant In Both - Sakshi

ఒక మహిళలకు రెండు గర్భాశయాలు ఉండటం అనేది అత్యంత అరుదు. ఇలా ఉంటే డెలివరీ టైంలో చాలా రిస్క్‌ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఉన్నా రెండింటిలోనూ శిశువులు పెరగడం అనేది కూడా అరుదే. అలాంటి విచిత్ర ఘటనే అలబామాకు చెందిన మహిళ విషయంలో జరిగింది. 

అసలేం జరిగిందంటే..దక్షిణ అమెరికాలోని అలాబామాకు చెందిన కెల్సీ హాట్చర్‌, కాలేబ్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఐతే ఆమె మరోసారి గర్భం దాల్చింది. ఇందులో వింత ఏంటి? అని అనుకోకండి..ఎందుకంటే? ఈసారి ఒకేటైంలో రెండుసార్లు గర్భం దాల్చింది. ఇదేలా సాధ్యం అని వైద్యులు కూడా షాక్‌ అయ్యారు. ఇక్కడ కెల్సీకి తన ఆరోగ్య గురించి ముందు తెలుసు. దీంతో ఆమె ఈసారి తన కడుపులో ఇద్దరు ఉన్నారని తన భర్తకు చెబుతుంది. ఆటపట్టిస్తున్నావు ఇద్దరెలా ఉంటారని ఆమె భర్త కూడా కొట్టిపడేశాడు కూడా. నిజమే!ఇద్దరు శిశువులు పెరుగుతున్నారని నమ్మకంగా చెప్పింది తన భర్తకి.

ఆ మహిళకు రెండు గర్భాశయాలున్నట్లు డాక్టర్లు ఇదివరకే ఆమెకు చెప్పారు. అయితే ఈసారి రెండు గర్భాశయాల్లోనూ శిశువులు పెరుగుతున్నాయి. ఇలా జరగదు. ఏదో ఒక దానిలో గర్భం పెరగడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ రెండు గర్భాశయాలు దేనికది వేరుగా పిండాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఒక గర్భాశయంలో ఇద్దరు ఉంటే కవలలు అని పిలుస్తాం. ఇప్పుడు వేర్వేరు గర్భాశయాల్లో పిండాలు పెరుగుతున్నప్పుడూ కూడా కవలలనే పిలవాలా? అనేది సందేహస్పదమైన ప్రశ్న. ఈ మేరకు ఆమెకు వైద్యం అందిస్తున్న గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ శ్వేతా పటేల్‌ మాట్లాడుతూ.. ఇలాంటివి అత్యంత అరుదని అన్నారు.

కొంతమందది స్త్రీల్లో పుట్టుకతో ఇలా రెండు గర్భాశయాలు ఉంటాయి. ఈ గర్భాశయాలు రెండు చిన్న గొట్టాలతో ప్రారంభమవుతుంది. ఐతే పిండం పెరుగుతున్నప్పుడూ గొట్టాలు సాధారణంగా పెద్ద బోలు అవయవాన్ని సృష్టించేలా కలుస్తాయి. దీన్నే గర్భాశయం అంటారు. కొన్నిసార్లు ఈ ట్యూబ్‌లు పూర్తిగా చేరవు. బదులుగా దేనికది ప్రత్యేకంగా లేదా వేర్వేరు అవయవంగా అభివృద్ధి చెందుతాయి. డబుల్‌ గర్భాశయం ఒక యోని ప్రారంభాన్ని కలిగి ఉంటుంది. ఈ ఓపెనింగ్‌ను సర్విక్స్‌ అంటారు. కొన్ని సందర్భాల్లో ఇలా ప్రతి గర్భాశయం సెపరేట్‌ గర్భాశయాన్ని కలిగి ఉంటాయన్నారు. నిజానికి రెండు గర్భాశయాలు ఉన్న చాలా వరకు ఒక గర్భాశయంలోనే పిండం పెరుగుతుంది. రెండు గర్భాల్లోనూ పిండం అనేది పెరగదు. సరిగ్గా పిండం ఎదిగే క్రమంలో ఆ రెండు గొట్టాల్లా ఉన్న ట్యూబ్‌లు ఒక్కటిగా అయ్యి పిండం పెరిగేలా ఒకే గర్భాశయంగా మారతాయి. అరుదైన సందర్భాల్లోనే ఇలా వేర్వేరుగానే రెండు గర్భాశయాల్లో పిండాలు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుందన్నారు శ్వేతా పటేల్‌. 

ఇలా డబుల్‌ గర్భాశయం ఉన్న స్త్రీలు విజయవంతంగా ప్రెగ్నెంట్‌ అయినప్పటికీ తరుచుగా గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడం జరుగుతుంటుందని క్లిష్టతర కాన్పుల నిపుణడైన డాక్టర్‌ రిచర్డ్‌ డేవిస్‌ చెబుతున్నారు. ప్రతి వెయ్యి మంది మహిళలల్లో ముగ్గురికి ఇలా డబుల్‌ గర్భాశయం లేదా డబుల్‌ గర్భాశయాలు ఉండొచ్చు అని వివరించారు. ప్రస్తుతం తాము సదరు మహిళ కెల్సీని ప్రసవం అయ్యేంత వరకు చాల జాగ్రత్త పర్యవేక్షిస్తూ.. ట్రీట్‌మెంట్‌ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. తాము ఇద్దరు శిశువులు బాగున్నారని భరోశ ఇవ్వలేమని పటేల్‌ చెబుతున్నారు. వైద్య పరంగా ఇది అరుదైన విషయమే అయినా ఆ శిశువులని కవలలని కాకుండా ప్రత్యామ్నాయంగా ఏమని పిలవాలో తెలియాల్సి ఉందన్నారు. 

(చదవండి: ఆహారం అనేది రుచి కోసం అనుకుంటే అంతే సంగతులు! వైద్యులు స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top