
జార్జియా డిజిటల్ యూనివర్శిటీ డాక్టరేట్
అంబర్ పటేల్ నగర్‌కు చెందిన ప్రముఖ భరతనాట్య గురువు శ్రీమతి కూన ప్రియదర్శిని కి ఆగ్రా లోని రాడిసన్ హోటలో అమెరికాకు చెందిన జార్జియా డిజిటల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థ నీతి ఆయోగ్ ద్వార భరతనాట్య విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందించారు.
సినీ నటి మరియు విఖ్యాత భరతనాట్య కళాకారిణి సుధా చంద్రన్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రధానం చేయడం జరిగింది. ఈ పురస్కారాలు తీసుకున్నందుకు కారకులైన తన గురువులకు మరియు తల్లిదండ్రులకు డాక్టర్ కూన ప్రియదర్శిని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ సిరాజ్, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.