సమోసా, కచోరీ ఏం పాపం చేశాయ్‌..! ఇదీ లెటెస్ట్‌ ట్రెండ్‌ వైరల్‌ స్టోరీ | Sakshi
Sakshi News home page

సమోసా, కచోరీ ఏం పాపం చేశాయ్‌..! ఇదీ లెటెస్ట్‌ ట్రెండ్‌ వైరల్‌ స్టోరీ

Published Thu, Jan 4 2024 1:57 PM

Never hurt samosa and kachori hotels latest trend viral story - Sakshi

ఇప్పుడంటే బఫేలు, కేటరింగ్‌లు వచ్చాయి గానీ, గతంలో విందు భోజనాల్లో కొసరి కొసరి  వడ్డించడం అలవాటు.  ఏమండీ... ఇది రుచి చూశారా.. మీ కోసమే  స్పెషల్‌గా చేయించా... అసలు ఈ పనస పొట్టు బిర్యానీ తిని చూడండి.. హా..  ములక్కాడ, జీడిపప్పు  అబ్బ.. ఒక్కసారి రుచి  చూడండి... ఇంకో  పూర్ణ బూరె వేసుకోండి.. వేడి వేడిగా  నెయ్యి వేసుకొని తిన్నారంటే  బ్రహ్మాండం కదా..! అన్నట్టు చివర్లో తాంబూలం మర్చిపోకండి సుమా! ఇదీ పెళ్లిళ్లు, పేరంటాల్లో అతిథులకు  లభించే మర్యాద.    కానీ ప్రస్తుత బిజీ లోకంలో ఆ అప్యాయతలు మర్యాదలు అన్నీ మారిపోయాయి. ట్రెండ్‌ మారింది.  చుట్టాలు, బంధువుల ప్లేస్‌లోకి చిన్న చిన్న రెస్టారెంట్లు వచ్చి చేరాయి. దీన్ని అందిపుచ్చుకున్న చిన్న చిన్న రెస్టారెంట్లు,  హోటల్స్‌  వ్యాపారంలో ట్రెండ్‌ మార్చేశాయి. 

ప్రస్తుత బిజీ లోకంలో ఆనాటి అప్యాయతలు మర్యాదలు అన్నీ మారిపోయాయి. ట్రెండ్‌ మారింది.  దీన్నే చిన్నా, పెద్దా రెస్టారెంట్లు, హోటల్స్‌ క్యాష్‌ చేసుకుంటున్నాయి. చుట్టాలు, బంధువుల ప్లేస్‌లోకి చిన్న చిన్న రెస్టారెంట్లు వచ్చి చేరాయి.  రా రామ్మని ఊరించేలా కస్టమర్లను వినూత్నంగా ఆకట్టుకునే ప్రయత్నం  చేస్తున్నాయి.  ఇప్పటిదాకా సరికొత్త రుచులు,  వివిధ ప్రాంతాల వంటకాలను అందించిన హోటళ్లు భోజన ప్రియుల్ని, కొత్తగా తిందామనుకుని వచ్చే వారిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హంగులు, ఆర్భాటాలతో మెప్పించడమే కాకుండా చుట్టాల్లా ఆదరిస్తున్నాయి. (  శివారులో వినూత్న హోటళ్లు)

ఇక  ఆ తరువాత కస్టమర్లను ఆకట్టుకునేలా తమ హోటళ్ల పేర్లను పెట్టుకోవడంలో మరో అడుగు ముందుకేశాయి. తినేసి పో.., ఉలవచారు, కోడికూర-చిట్టిగారె,రాజుగారి పులావ్  లాంటి పేర్లతో  తమ హోటళ్ళకు  రప్పించుకుంటున్నాయి.  (ఆకలైతుందా.. తినేసిపో! అంతేరా! దా–తిను! )

సమోసాను, కచోరీని మర్చిపోతే ఎలా?
ఎప్పటికపుడు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ  కొంత  పుంతలు తొక్కుతున్నాయి.   ఈక్రమంలోనే ఇపుడు  నయా ట్రెండ్‌ వెలుగులోకి వచ్చింది. అయ్యా , మా హోటల్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సారి మాత్రం ఇవి మర్చిపోవద్దు అంటూ గుర్తు చేయడం విశేషంగా నిలిచింది. రెస్టారెంట్‌ బిల్లుపై సమోస, కచోరీ తినడం మర్చిపోకండి.. వాటిలో ఫిల్లింగ్‌ ఉంటుంది. కడుపు నిండుతుంది అన్నట్టు ఒక మెసేజ్‌ ఉండటం లేటెస్ట్‌ ట్రెండ్‌.  దీనికి సంబంధించిన రిసీట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఔరా అంటున్నారు భోజన ప్రియులు. (హంగూ, ఆర్బాటంలేదు, గుర్రమెక్కలేదు.. మూడు ముళ్లు వేయలేదు.. సింపుల్‌గా సెలబ్రిటీ పెళ్లి)

Advertisement
 
Advertisement
 
Advertisement