Myntra Shares Bollywood Star Rekha AI Images As Barbie Doll Goes Viral - Sakshi
Sakshi News home page

Rekha AI Images As Barbie: బార్బీరేఖ.. పిక్స్‌ వైరల్‌

Jul 16 2023 12:04 AM | Updated on Jul 16 2023 6:54 PM

Myntra Shares Bollywood Star Rekha AI Images As Barbie - Sakshi

అమెరికా బొమ్మల కంపెనీ ‘మ్యాటల్‌’ 1959లో ఫ్యాషన్‌ డాల్‌ ‘బార్బీ’ని లాంచ్‌ చేసింది. జర్మన్‌ అందాల బొమ్మ ‘బిల్డ్‌’ను స్ఫూర్తిగా తీసుకొని సృష్టించిన ‘బార్బీ’ తరాలకు అతీతంగా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. ఈ నెల 21న హాలీవుడ్‌ లైవ్‌–యాక్షన్‌ మూవీ ‘బార్బీ’ విడుదల కానుంది.

దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ ప్రచారంతో సంబంధం లేకపోయినా ‘మింత్ర’ సృష్టించిన చిత్రాలు అంతర్జాలంలో వైరల్‌ అయ్యాయి. 68 సంవత్సరాల రేఖను ఏఐ వపర్‌తో అందాల బార్బీ బొమ్మగా మార్చి నెటిజనులను అబ్బుర పరిచింది ఇండియన్‌ ఫ్యాషన్‌ ఇ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ మింత్ర.

Advertisement
 
Advertisement
Advertisement