అలా పట్టించుకోకుండా వెళ్లిపోతే ఎలా? : హిల్లేరియస్‌ వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

అలా పట్టించుకోకుండా వెళ్లిపోతే ఎలా? : హిల్లేరియస్‌ వీడియో వైరల్‌

Published Thu, Mar 21 2024 10:42 AM

A male Pheasant trying to impressto female what heppend next check - Sakshi

నెమలి మన జాతీయ పక్షి. అందమైన అపురూపమైన పక్షి. ఆడ నెమలిని ఇంప్రెస్‌ చేసేందుకు మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది. గున గున అడుగులేస్తూ ఆడ నెమలి వెంట తిరుగుతుంది. ఈ నాట్యం చేసేటప్పుడు తన పింఛాన్ని చుట్టూ వృత్తం లాగా చేస్తుంది. ఒక్కోసారి విసినకర్రలా వంచి   అందంగా నాట్యం చేస్తుంది. ప్రేయసి సంతృప్తి చెంది, చెంతక  చేరేదాకా  మగ నెమలికి  ఈ తిప్పలు తప్పవు.

అకస్మాత్తుగా మబ్బులు కమ్మేసి, చినుకులు పడినపుడు, ప్రధానంగా వడగళ్లు పడినపుడు సంతోషంతో పింఛంతో మగ నెమలి చేసే నాట్యం వర్ణశోభితంగా, అత్యంత రమణీయంగా ఉంటుంది కదా. తాజాగా గ్రేట్ ఆర్గస్ నెమలి ఆడ నెమలిని ఆకట్టుకునేందుకు పాట్లు, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నేచర్‌ ఈజ్‌ అమేజింగ్‌ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ షేర్‌ చేసిన ఈ వీడియో దాదాపు 30 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. వాస్తవానికి ఈ వీడియో 2021లో ఫ్లోరిడాలోని బే లేక్‌లోని డిస్నీస్ యానిమల్ కింగ్‌డమ్‌లోని మహారాజా జంగిల్ ట్రెక్‌లో తీసింది.  ఇపుడు మళ్లీ సందడి చేస్తోంది. 

ఈ తతంగం అంతా చూసి నెటిజన్లు చతురోక్తులతో స్పందిస్తున్నారు. ఇంత చేసినా అలా వెళ్లిపోతే ఎలా అంటూ ఫన్నీ కమెంట్లు పెడుతున్నారు. 

Advertisement
 
Advertisement