Sankranti 2023: పండగ రోజు ట్రెడిషనల్‌ లుక్‌ కోసం ఇలా చేయండి..

Makar Sankranti 2023: Makeup Tips For Traditional Look - Sakshi

మేకప్‌

పండగ రోజున సంప్రదాయ దుస్తులతో ప్రత్యేకంగా కనిపిస్తూ సందడి చేస్తారు. అదేవిధంగా మేకప్‌ కూడా ప్రత్యేకంగా ఉంటే లుక్‌ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.  రోజంతా మేకప్‌తో ఫ్రెష్‌ లుక్‌లో కనిపించాలంటే ఎంపిక చేసుకునే సాధనాలలోనూ జాగ్రత్త వహించాలి. 

బ్లష్‌ 
సంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు ఎక్కువ మేకప్‌ వేసుకోవడం కాస్త కష్టమే. అయితే, ట్రెడిషనల్‌గా నేచురల్‌ లుక్‌ కావాలంటే బ్లష్‌ అప్లై చేసుకోవచ్చు. ఫెయిర్‌గా ఉన్నవారు బ్లష్‌తో వారి ముఖారవిందాన్ని మరింతగా మెరిపించుకోవచ్చు. బ్లష్‌ అప్లై చేసిన తర్వాత రెగ్యులర్‌ ఫౌండేషన్‌ తో టచ్‌ అప్‌ చేయాలి. 

హైలైటర్‌ 
ధరించిన దుస్తులు ప్రకాశవంతమైన రంగులో ఉంటే, దానితో ప్రత్యేకంగా కనిపించడానికి లైట్‌ మేకప్‌ ఉత్తమంగా ఉంటుంది. ఇది న్యూడ్‌ ఐషాడో, లిప్‌స్టిక్‌తో పాటు చాలా తేలికపాటి బేస్‌ ఉంటుంది. దీనికోసం  లైట్‌ హైలైటర్‌ని ఉపయోగించవచ్చు.

మెరిసే కనుబొమ్మ
గ్లిట్టర్‌ ఐషాడో ఎంపిక పండుగ రోజున ఉత్తమ ఎంపిక. సంప్రదాయ రూ΄ాన్ని అధునాతనంగా మార్చడానికి దీన్ని ప్రయత్నించవచ్చు. జరీ అంచు దుస్తులు ధరిస్తారు కాబట్టి బంగారు లేదా వెండి షిమ్మర్‌ ఐషాడో వేసుకుంటే ముఖ కాంతి మరింతగా పెరుగుతుంది. 

మాట్‌ లుక్‌
చాలా మంది సినీ తారలు మాట్‌ లుక్‌ మేకప్‌ని అనుసరిస్తారు. దీంతో చీర లేదా మరేదైనా సంప్రదాయ వేషధారణలో వారు మరింత అందంగా కనిపిస్తారు. మ్యాట్‌ లుక్‌ చర్మాన్ని ప్రకాశవంతంగా, సహజంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఈ మేకప్‌ వేసుకునే ముందు చర్మ తత్వం గురించి తెలుసుకోవాలి.

డార్క్‌ లిప్‌ స్టిక్‌
డార్క్‌ లిప్‌స్టిక్‌ మీ మేకప్‌ను మరింత అందంగా మారుస్తుంది. పండగరోజుల్లో సాధారణంగా బ్రైట్‌గా ఉండే దుస్తులను ధరిస్తారు కాబట్టి అప్పుడు ముదురు రంగు లిప్‌స్టిక్‌ ఎంపిక ధరించిన దుస్తులకు తగిన విధంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మాట్‌ లిప్‌స్టిక్‌ షేడ్స్‌ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.   
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top