
ఓనమ్ పండగ ఆనందంలో మాత్రమే కాదు... సక్సెస్ సంబరంలోనూ ఉన్నారు మాళవికా మోహనన్. మోహన్‌లాల్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించిన మలయాళ చిత్రం ‘హృదయపూర్వం’ ఇటీవల విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో జోష్‌గా పండగ చేసుకున్నారు మాళవిక. మరో మాట.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’తో తెలుగులోకి వస్తున్నారీ బ్యూటీ. ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది.
⇒ ‘8 వసంతాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అనంతికా సనీల్‌కుమార్. ఈ యంగ్ బ్యూటీ ఓనమ్ సెలబ్రేషన్స్‌ను కాస్త ముందుగా మొదలుపెట్టి, ఆ ఫొటోలు షేర్ చేసి, ఆనందాన్ని వ్యక్తపరిచారు.
⇒ తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఆల్రెడీ గెలుచుకున్న హీరోయిన్ కృతీ శెట్టి ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రేమ, శాంతి, ఆనందం... మనందరి జీవితాల్లో నెలకొనాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారీ బ్యూటీ.
⇒ అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు హీరోయిన్ సంయుక్త. అయినా పండగకి ఓ కాల్షీట్ కేటాయించారీ సుందరి. ఓనమ్ ఫెస్టివల్‌ను సంతోషంగా జరుపుకుని, అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు.
⇒ ఒకప్పటి హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మీనా గురించి, తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మీనా ఓనమ్ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసి, ఆ ఫొటోలను షేర్ చేశారు. ఇక వెంకటేశ్ కాంబినేషన్‌లో మీనా నటించనున్న ‘దృశ్యం 3’ సినిమా ఈ నవంబరులో ప్రారంభం కానుంది.
ఇంకా హీరోయిన్లు మడోనా సెబాస్టియన్, అంజు కురియన్, అనిఖా సురేంద్రన్ వంటి మరికొందరు ఓనమ్ పండగను జరుపుకున్నారు. కొందరు పండగ రోజున, మరికొందరు ప్రీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంటూ సందడి చేశారు.