'కంటిచూపు' ను ఈ జాగ‍్రత్తలతో కాపాడుకుందాం..!

Let's Protect Eyes With These Precautions - Sakshi

ఈ రోజుల్లో కొంతమందికి చిన్న వయసులోనే కళ్లజోళ్లు వచ్చేస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం వలన గాని, కొన్ని అలవాట్ల వల్ల గాని కంటి చూపు మందగిస్తుంది. సైట్‌ వచ్చిన తరువాత బాధపడడం కన్నా రాకుండా కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. సైట్‌ వచ్చిన వారికి మాత్రమే కాదు, భవిష్యత్తులో సైట్‌ రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినవలసిన ఆహార పదార్థాల గురించి  తెలుసుకుందాం. కళ్లను కాపాడుకుందాం. 

పోషకాల లోపం..

  • కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కంటి చూపును పెంచే ఆహార పదార్థాలను విరివిగా తీసుకోండి.
  • విటమిన్‌ – సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ బాగా తీసుకోవాలి. ఇవి కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.
  • వీటితో పాటుగా చేపలు, గుడ్లు, బాదం పప్పు, పాల పదార్థాలు, క్యారట్, చిలకడదుంపలు వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోండి.

    చత్వారం వంటివి ఉన్న పెద్దవారికే కాదు.. పిల్లలకు కూడా నేత్ర పరీక్ష అవసరం.చూపు సమస్యలను ముందే గుర్తించకపోతే పిల్లలు చదువుల్లో వెనకబడటమే కాదు.. శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మధుమేహం, హైబీపీ ఉన్న వారికి కంట్లోని రెటీనా పొరలో మార్పులు వస్తుంటాయి, నీటికాసుల వంటి ప్రమాదకర సమస్యలకు కూడా ముందస్తుగా ఎలాంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి నేత్ర పరీక్ష చేయించుకోవాలి.

ఇవి కూడా చదవండి: 'లవంగం టీ' ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!?

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top