కింగ్‌ చార్లెస్‌కి కేన్సర్‌..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..? | King Charles III Diagnosed With Cancer His Rigid Diet And Fitness Routine | Sakshi
Sakshi News home page

కింగ్‌ చార్లెస్‌కి కేన్సర్‌..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?

Feb 6 2024 12:10 PM | Updated on Feb 6 2024 12:47 PM

King Charles III Diagnosed With Cancer His Rigid Diet And Fitness Routine - Sakshi

బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ III కేన్సర్‌తో బాధపడుతున్న బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ పేర్కోంది. ఆయన గత నెలలో ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్‌గా నిర్దారణ అయినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన కేన్సర్‌ అనేది వెల్లడించలేదు. సోమవారం నుంచి చికిత్స మొదలైందని, కాబట్టి కొద్ది రోజు ప్రజావిధుల నుంఇచ తప్పుకుంటారని పేర్కొంది. ఇక బ్రిటిఫ్‌ ప్రెస్‌ ప్రకారం ఆయన కెరిర్‌లో కొన్ని గాయాలు, రెండుసార్లు కరోనా మహమ్మారి బారిని పడటం మినహా రాజ అద్భుతమైన ఆరోగ్యకరమ జీవితాన్నే గడిపారు. 

ఆయన చక్రవర్తిగా 2022లో సింహాసనాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. పైగా బ్రిటిష్‌ చరిత్రలో రాజుగా పట్టాభిషేకం అయిన అంత పెద్ద వయసు వ్యక్తి కూడా ఆయనే. ఇక ఆయన లైఫ్‌స్టైల్‌ విషయానికి వస్తే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారని అంతరంగికులు చెబుతున్నారు. అందులోనూ ఆయన ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని అంటునన్నారు. అలాంటి ఆయన ఈ కేన్సర్‌ మహమ్మారిన బారిన పడటం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన ఆహార అలవాట్లు ఎలా ఉండేవి? రోజూవారి దినచర్య ఎలా ఉంటుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందామా!.

ఆయన ఒకసారి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిజీ షెడ్యూల్‌కు ఆటంకం కలిగించే భోజనం లగ్జరీ లాంటిదని విశ్వసిస్తానని అన్నారు. అంతేగాదు ఆయన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వంటివి చేస్తారని అధికారిక వర్గాల సమాచారం. 2018లో కార్లెస్‌ హౌస్‌లో తన 70వ పుట్టిన రోజు పురస్కరించుకుని తనకు సంబంధించిన 70 వాస్తవాల జాబితాలో తాను రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటానని అదికూడా అల్పహారం, రాత్రి భోజనం మాత్రమేనని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారంలో రెండు రోజులు పూర్తిగా శాకాహారం భోజనం తింటానని, పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.

ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువుగా మొక్కల ఆధారిత ఆహారమే ఎక్కువగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అల్పాహారంలో ఎక్కువగా చీజ్‌, ఉడకబెట్టిన గుడ్లు, పాలు, తేనేతో కూడిన డార్జిలింగ్‌ టీ తదితరాలే తీసుకుంటారని రాయల్‌ డైట్‌ పేర్కొంది. ఆయన ఎక్కువగా సేంద్రీయ ఉత్పత్తులనే ఇష్టపడతారని రాయల్‌ చెఫ్‌లు చెబుతున్నారు. ఇక ఫిట్‌నెస్‌ విషయానికి వచ్చేటప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయమాలు చేస్తారని ప్యాలెస్‌ పేర్కొంది. అలాగే కెనడియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కి సంబంధించిన ఐదు ప్రాథమిక వ్యాయమాలను రోజుకు రెండుసార్లు చేస్తారని తెలిపింది.

ముఖ్యంగా రెండు నిమిషాల స్ట్రెచింగ్‌ ఒక నిమిషం సిట్‌ అప్‌లు, మరో నిమిషం బ్యాక్‌ లెగ్‌ రైజ్‌లు పుష్‌ అప్‌లు 11 నిమిషాలు చేస్తారని వెల్లడించింది. వాటన్నింటి తోపాటు ఆరు నిమిషాల పాలు రన్నింగ్‌, ప్రతి 75 అడుగులకు డేగ జంప్‌లు చేయడం, వాతావరణం బాగుంటే ఎక్కువ సేపు బహిరంగ ప్రదేశంలో గడపడం వంటివి చేస్తారని రాయల్‌ ప్యాలెస్‌ పేర్కొంది. ఇంతలా పిట్‌నెస్‌గా ఉంటూ మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించనప్పటికీ కొన్ని రకాల వ్యాధులు ఎందుకు దాడి చేస్తాయనేది ఎవ్వరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న. నిజం చెప్పాలంటే వ్యాధికి రాజు, పేద అనే తారతమ్యం ఉండదేమో రావాలి, వేదన అనుభవించాలి అని ఉంటే టైంకి వచ్చి దాని ప్రభావం చూపించేస్తుందేమో కదూ!.

(చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement