మేజికల్‌ మేఘాలయ ఎక్స్‌ విశాఖపట్నం‌ | IRCTC Launches Magical Meghalaya Air Package | Sakshi
Sakshi News home page

మేజికల్‌ మేఘాలయ ఎక్స్‌ విశాఖపట్నం‌

Apr 12 2021 2:57 PM | Updated on Apr 12 2021 3:04 PM

IRCTC Launches Magical Meghalaya Air Package - Sakshi

ఐఆర్‌సీటీసీ భారతీయ దర్శన్‌లో భాగంగా ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్న టూర్‌ ప్యాకేజ్‌ పేరు ‘మేజికల్‌ మేఘాలయ ఎక్స్‌ విశాఖపట్నం’. ప్యాకేజ్‌ కోడ్‌: SCBA25. ఇది ఆరు రోజుల (ఐదు రాత్రులు) పర్యటన. ఇందులో చిరపుంజీ, గువాహటి, మావ్‌లిన్నాంగ్, ఖజిరంగ, షిల్లాంగ్‌లను చూడవచ్చు. ఏప్రిల్‌ 24వ తేదీ మొదలై 29 తో పూర్తవుతుంది. ప్యాకేజ్‌ రాను, పోను విమాన చార్జీలతో కలిపి ఉంటుంది. సింగిల్‌ ఆక్యుపెన్సీలో 36,199 రూపాయలవుతుంది. డబుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 30,099, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 28,059 రూపాయలు.

24వ తేదీ 6E 6038 విమానం ఉదయం పదిం పావుకు విశాఖపట్నంలో బయలుదేరి 11.50 గంటలకు కోల్‌కతా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు చేరుతుంది. అక్కడి నుంచి ‘6E 568’ విమానం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు కోల్‌కతాలో బయలుదేరి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు గువహటి చేరుస్తుంది.29వ తేదీ ‘6E 6966’ విమానం సాయంత్రం ఐదు గంటలకు గువాహటి నుంచి బయలుదేరి ఆరు గంటల పదిహేను నిమిషాలకు కోల్‌కతాకు చేరుస్తుంది. అక్కడి నుంచి ‘6E 675’ విమానం ఏడు గంటల యాభై నిమిషాలకు కోల్‌కతాలో బయలుదేరి రాత్రి తొమ్మిదిన్నరకు విశాఖపట్నం చేరుస్తుంది.

మొదటి రోజు: విశాఖపట్నం నుంచి గువహటి వరకు విమాన ప్రయాణం. గువహటి నుంచి రోడ్డు మార్గాన షిల్లాంగ్‌ చేరి హోటల్‌లో చెక్‌ అవడం. రాత్రి బస.
రెండవ రోజు: బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ప్రయాణం చిరపుంజి వైపు సాగుతుంది. మధ్యలో నొహ్‌కలికై జలపాతం, మౌసమి గుహలను చూసుకుని సాయంత్రం షిల్లాంగ్‌కు తిరుగు ప్రయాణం. తిరుగు ప్రయాణంలో ఎలిఫెంటా ఫాల్స్‌ చూడవచ్చు. ఆ రాత్రి కూడా బస షిల్లాంగ్‌లోనే.
మూడవరోజు: బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత షిల్లాంగ్‌ నుంచి మావ్‌లిన్నాంగ్‌కు ప్రయాణం. ఇది ఆసియాలో క్లీనెస్ట్‌ విలేజ్‌.  వేళ్ల వంతెనలు, దాకీ సరస్సు చూసుకుని సాయంత్రం తిరిగి షిల్లాంగ్‌కు ప్రయాణం. షిల్లాంగ్‌లో రాత్రి బస.
నాలుగవ రోజు: బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత షిల్లాంగ్‌లో హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి ఖజిరంగాకు బయలుదేరాలి. దారిలో డాన్‌బాస్కో మ్యూజియం, ఉమియుమ్‌ లేక్‌ పర్యటన ఉంటుంది. ఖజిరంగ చేరగానే హోటల్‌ గదిలో చెక్‌ ఇన్, రాత్రి బస.
ఐదవ రోజు: తెల్లవారు జామున ఏనుగులను చూడడానికి వెళ్లవచ్చు. ఇది ప్యాకేజ్‌లోకి రాదు. సొంతంగా వెళ్లాలి. అలా వెళ్లిన వాళ్లు రొటీన్‌ టూర్‌ ప్లాన్‌ సమయానికి తిరిగి హోటల్‌కు వచ్చి రిఫ్రెష్‌ అయ్యి బ్రేక్‌ఫాస్ట్‌ చేసి సిద్ధంగా ఉండాలి. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత నట్ట నడి అడవిలోకి జీపు సఫారీ ఉంటుంది. గది చెక్‌ అవుట్‌ చేసి గువహటి వైపు సాగిపోవాలి. దారిలో బాలాజీ ఆలయాన్ని దర్శించుకుని గువహటి చేరి హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌ అయ్యి రాత్రి బస చేయాలి.
ఆరవ రోజు: బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత గది చెక్‌ అవుట్‌ చేసి బయలు దేరాలి. ఎయిర్‌ పోర్టుకు చేరే లోపు దారిలో కామాఖ్య ఆలయ దర్శనం ఉంటుంది. మూడు గంటలకు ఎయిర్‌పోర్టులో డ్రాప్‌ చేస్తారు. ప్యాకేజ్‌లో విమానం టిక్కెట్‌లు, హోటల్‌ గదుల అద్దె, ఐదు బ్రేక్‌ఫాస్ట్‌లు, ఐదు డిన్నర్‌లు, ఏసీ వాహనాల్లో లోకల్‌ సైట్‌ సీయింగ్, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటాయి.

చదవండి: ట్రావెల్‌ టిప్స్‌: జాగ్రత్తగా వెళ్లి వద్దాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement