
అమ్మమ్మ నోటి నుంచి భక్తి భావనతో వినిపించే కీర్తనలు, గురుద్వారాలో విన్న కీర్తనలు బనత్ నోటి నుంచి తీయగా వినిపించేవి. బనత్ కౌర్ బగ్గాకు చిన్నప్పటి నుంచే సంగీతంతో చక్కని స్నేహం ఉంది. స్కూల్ ఫంక్షన్‌లలో, ఫ్యామిలీ ఫంక్షన్‌లలో తన పాట తప్పకుండా ఉండాల్సిందే. అయిదు సంవత్సరాల వయసులోనే హార్మోనియం వాయించి శ్రోతలను అబ్బురపరిచింది.
లా స్టూడెంట్‌గా ఉన్నప్పుడు డెబ్యూ సింగిల్ ‘మూన్’ వచ్చింది. పంజాబీ నేపథ్యం ఉన్న బనత్ హిందీ, పంజాబీ పాటలకు తనదైన మెరుపు ఇస్తుంది. సింగర్–సాంగ్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న బనత్ కౌర్ బగ్గా పాప్ అండ్ రాక్, నియో క్లాసికల్ అండ్ ఫోక్‌లో మంచి పేరు తెచ్చుకుంది.
తీరికవేళల్లో చక్కటి కవిత్వాన్ని ఆస్వాదించడం తనకు ఇష్టం. కొన్నిసార్లు మ్యూజిక్ కంటే కవిత్వ పంక్తులు రాసుకోవడం అంటేనే ఇష్టం. పిల్లల కోసం ముంబైలో ‘క్లాస్‌రూమ్’ పేరుతో మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసింది బనత్ కౌర్ బగ్గా.