వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారోయి..!

Interesting Fact: Magic Bendable Rock In World Itacolumite - Sakshi

ఎలాంటి రాయినైనా సరే ముక్కలు చేయొచ్చు, ఉలితో చెక్కి శిల్పంగా మలచవచ్చు. కానీ, ఫొటోలో కనిపిస్తున్నట్లు ఎలా వంచగలుగుతున్నారో తెలియాలంటే ఈ రాయి గురించి తెలియాల్సిందే. పేరు.. ఇటాకోలమైట్‌. పోరస్‌ ఇసుకరాయి జాతికి చెందింది. సాధారణ రాళ్ల మాదిరే ఇది కూడా వివిధ రంగులు, రూపాలు, పరిమాణాల్లో ఉంటుంది. అయితే, ఎప్పుడైతే ఈ రాయి.. ఒక సెంటీమీటర్‌ మందం, 20 సెంటీమీటర్ల పొడవుగల సమాంతర పరిమాణంలోకి మారుతుందో.. అప్పుడు దీనికి వంగే స్వభావం వస్తుంది.

ఈ విషయాన్ని ఈ మధ్యనే ఇటలీకి చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతకంటే ఒక్క మిల్లీమీటర్‌ సైజ్‌లో తేడా వచ్చినా, ఆ రాయి అంగుళం కూడా వంగదు. ఈ రాయికి, ఆ పరిమాణానికి, ఆ స్వభావానికి ముడిపడి ఉన్న సంబంధం ఏమిటో ఇంకా అంతుచిక్కాల్సి ఉంది.

కానీ, భూకంపాలు, బలమైన గాలులు, తుఫానుల వంటి ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడగలిగే భవన నిర్మాణాల రూపకల్పనలో ఈ రాళ్లు ఎంతోగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లల్లో కొన్నిరకాలు నీటిలో తేలే స్వభావం కలిగి ఉంటాయి. అలాగే ఈ రాళ్లు వంగే స్వభావం కలిగినవిగా చెబుతున్నారు. ఏది ఏమైనా అసలు నిజం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.

చదవండి: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top