డయాబెటిస్‌ లేకపోయినా..తరచు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందా?

If You Feel Frequent Urination Causes And Treatment - Sakshi

తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తే దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి. అయితే డయాబెటిస్‌ ఉన్నవారిలో సహజంగానే ఇలా జరుగుతుంది. కనుక ఆ వ్యాధి ఉందో, లేదో చెక్‌ చేయించుకోవాలి. ఒకవేళ డయాబెటిస్‌ లేకపోయినా మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందంటే.. దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి.

  • కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ముఖం అంతా వాపులకు గురై ఉబ్బిపోయి కనిపిస్తుంది. కాలి మడమలు, కాళ్లు, పాదాలు, చేతులు ఉబ్బిపోయి కనిపిస్తాయి
  • కిడ్నీ సమస్యలు ఉంటే తీవ్రమైన అలసట వస్తుంది. కొందరిలో రక్తహీనత సమస్య కూడా ఏర్పడుతుంది
  • చర్మం పొడిగా మారి దురదలు పెడుతుంది ∙నోటి దుర్వాసన ఉంటుంది ∙కిడ్నీ సమస్యలు ఉంటే కొందరిలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కొందరికి తల తిరిగినట్లు అనిపిస్తుంది
  • కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో వెన్ను నొప్పి వస్తుంటుంది
  • వాంతి వచ్చినట్టుగా... వికారంగా అనిపిస్తుంది
  • కిడ్నీ సమస్యలు ఉంటే శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది
  • కిడ్నీ సమస్యలు ఉన్నవారు వేడి వాతావరణంలో ఉన్నప్పటికీ చలిగా అనిపిస్తుంది. కొందరు వణుకుతారు. 
  • పైన తెలిపిన లక్షణాలు కనుక ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి వారి సలహా మేరకు సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అవసరం అయితే మందులను వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను తినాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

(చదవండి: ఆరోగ్య చిట్కాలు చెప్పనున్న సమంత.. అందుకోసం..!)

                                                                             

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top