ఇన్‌స్టంట్‌గా చేసుకునే స్వీట్‌ కార్న్‌ గారెలు | How To Make Sweetcorn Vada Recipe In Telugu | Sakshi
Sakshi News home page

స్వీట్‌ కార్న్‌తో గారెలు.. సాయంత్రం స్నాక్స్‌కి పర్‌ఫెక్ట్‌

Dec 13 2023 3:03 PM | Updated on Dec 13 2023 3:11 PM

How To Make Sweetcorn Vada Recipe In Telugu - Sakshi

స్వీట్‌ కార్న్‌– తోటకూర గారెలు తయారీకి కావల్సినవి:

లేత స్వీట్‌ కార్న్‌ గింజలు, లేత తోటకూర ఆకులు – రెండున్నర కప్పుల చొప్పున (శుభ్రం చేసి పెట్టుకోవాలి)
అల్లం – కొద్దిగా,వెల్లుల్లి రెమ్మలు – 7,ఉప్పు – తగినంత
జీలకర్ర – ఒక టీ స్పూన్‌,సోంపు – అర టీ స్పూన్‌
ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (చిన్నగా కత్తిరించుకోవాలి)
బియ్యప్పిండి – పావు కప్పు
పచ్చిమిర్చి – 4 (చిన్నగా తరగాలి),నూనె – సరిపడా

తయారీ విధానమిలా: ముందుగా మిక్సీలో స్వీట్‌ కార్న్, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, తోటకూర ఆకులు (కాడల్లేకుండా) బరకగా మిక్సీ పట్టుకోవాలి. అవసరం అయితే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. జీలకర్ర, సోంపు, బియ్యప్పిండి, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ జారుగా మారితే బియ్యప్పిండి పెంచుకోవచ్చు. వీటిని చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. 

Advertisement
 
Advertisement
Advertisement