How To Make Mushroom Lollipop Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Mushroom Lollipop: మష్రూమ్స్‌తో లాలీపాప్స్‌.. ఎప్పుడైనా ట్రై చేశారా?

Aug 11 2023 3:39 PM | Updated on Aug 11 2023 4:16 PM

How To Make Mushroom Lollipop Recipe In Telugu - Sakshi

మష్రూమ్‌ లాలీపాప్స్‌ తయారీకి కావల్సినవి: 

పుట్టగొడుగులు – అర కప్పు (వేడి నీళ్లల్లో ఉడికించి, శుభ్రం చేసుకుని మిక్సీ పట్టుకోవాలి),
ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్‌ తరుగు, కొత్తిమీర తురుము – 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున,
బఠాణీ, స్వీట్‌ కార్న్‌ – 3 టేబుల్‌ స్పూన్ల చొప్పున(ఉడికించినవి), పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్, కారం,
గరం మసాలా, ఆమ్‌ చూర్‌ పౌడర్, చాట్‌ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్‌ చొప్పున,
బ్రెడ్‌ పౌడర్‌ – పావు కప్పు, నీళ్లు – అర కప్పు, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా



తయారీ విధానమిలా..
ముందు ఒక బౌల్‌ తీసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్‌ తరుగు, కొత్తిమీర తురుము, ఉడికించిన  పుట్టగొడుగుల గుజ్జు, బఠాణీ, స్వీట్‌ కార్న్, పచ్చిమిర్చి ముక్కలు, కారం, గరం మసాలా, ఆమ్‌ చూర్‌ పౌడర్, చాట్‌ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్‌ పౌడర్, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. ఒక్కో ఉండకు ఒక్కో ఐస్‌క్రీమ్‌ పుల్ల గుచ్చి.. నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. అనంతరం టమోటా సాస్‌ లేదా కొత్తిమీర చట్నీలో ముంచి సర్వ్‌ చేసుకోవచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement