చర్మంపై మచ్చలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

How To Avoid Tinea Versicolor Patches On Skin - Sakshi

చాలామందిలో ఒంటిపై మచ్చలు రావడం సాధారణం. కొద్దిమందిలో ఇవి తెల్లమచ్చల్లా, మరికొందరిలో కాస్తంత నల్లమచ్చలా కనిపిస్తుంటాయి. ‘టీనియా వెర్సికలర్‌’ అనే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కూడా ఈ మచ్చలు రావచ్చు. ఇలాంటి మచ్చలు రాకుండా నివారించుకునేందుకు ఈ సూచనలు పాటించడం మేలు. 

  • చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. 
  • గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. 
  • జిడ్డు చర్మం ఉన్నవారు... చర్మాన్ని శుభ్రం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. అయితే చర్మాన్ని మరీ అతిగా పొడిబారనివ్వకూడదు.  శరీరం మీద నూనెగానీ, ఇతరత్రా జిడ్డు పదార్థాలనుగాని పూయకూడదు.
  • బిగుతుగా, గాలి ఏమాత్రం చొరబడకుండా ఉండే దుస్తులు ధరించకూడదు. తమ ప్రైవేట్‌ పార్ట్స్‌లో ఎక్కువచెమట పట్టకుండా చూసుకుంటూ ఉండాలి.
  • రోజూ వ్యాయామం చేయాలి.
  • అప్పటికే మచ్చలు వచ్చిన వారు డాక్టర్‌ సలహా మేరకు కెటొకోనజోల్‌ ఉండే  పౌడర్‌ డాక్టర్లు సూచించిన కాలానికి వాడాలి. 
     
Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top