‘ఇదేందిరా మావా..ఈ భార్యలున్నారే..!’ వైరల్‌ వీడియో | hilarious video goes viral on wife and husband | Sakshi
Sakshi News home page

‘ఇదేందిరా మావా..ఈ భార్యలున్నారే..!’ వైరల్‌ వీడియో

Apr 8 2024 11:59 AM | Updated on Apr 8 2024 3:10 PM

hilarious video goes viral on wife and husband - Sakshi

పొద్దున్న లేచింది  మొదలు..సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు హల్‌చల్‌ చేస్తుంటాయి. కొన్ని జీవిత సత్యాల్ని అవగతం చేయిస్తాయి. ఇంకొన్ని నవ్వు పుట్టిస్తాయి. మరి కొన్ని ఆలోచింప చేస్తాయి. మరికొన్ని సెటైరికల్‌గా, వ్యంగ్యంగా, తమాషాగా ఉంటాయి. మన నిత్య జీవితంలో ఇలాంటి వీడియోలు చూడటం మనకి ఒక అలవాటుగా మారి పోయింది.

తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు  ‘ఈ ఆడోళ్లున్నారే..’ అని కొందరు, ఏందిరా మావా..ఇది  మరికొందరు యూజర్లు కమెంట్‌ చేస్తున్నారు.  ఈ వీడియో ఇప్పటికే 11. 5 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

వీడియో సారాంశం ఏమిటంటే.. తుఫాన్లు, సునామీలు, ప్రళయం ఏం వచ్చినా పట్టించుకోకుండా నిద్రపోతున్న భార్య,  భర్త ఫోన్‌కు మెసేజ్‌కు రాంగానే  మాత్రం ఠపీమని లేస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement