Carrot Juice: క్యారట్‌ జ్యూస్‌ తాగే అలవాటుందా?... ఈ విషయాలు తెలిస్తే..

Health Tips: Surprising Benefits Of Drinking Carrot Juice - Sakshi

Carrot Juice- Health Benefits: పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారికి క్యారెట్‌ జ్యూస్‌ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శీతాకాలంలో వచ్చే పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. తరచు మలబద్ధకం, గ్యాస్‌ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా క్యారట్‌ జ్యూస్‌ను ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.

క్యారట్‌ రసంలో విటమిన్‌ ఎ, సి, డి, కె మొదలైన అనేక రకాల విటమిన్లు లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. క్యారట్‌లో బీటా కెరోటిన్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి శరీర బరువును నియంత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. 

మలబద్ధకంతో బాధపడుతున్న వారికి క్యారట్‌ జ్యూస్‌ ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణవ్యవస్థను శక్తిమంతంగా చేసి అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడతాయి. కాబట్టి పొట్ట సమస్యలు, బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ ఖాళీ కడుపుతో క్యారట్‌ జ్యూస్‌ తీసుకోవడం మంచిది. 
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం దొరుకుతుంది.

చదవండి: Health: డెలివరీ తర్వాత తన ప్రవర్తనలో చాలా మార్పు! కారణమేంటి?
అకస్మాత్తుగా గుండె పట్టేయడం.. గుండెపోటుతో చనిపోతాననే భయం! ఎందుకిలా? సమస్య ఏమిటంటే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top