గ్రీన్‌ గణేశాయ నమః..! పండుగ పచ్చగా..ప్రకృతి మెచ్చగా.. | Ganesh Chaturthi 2025: Plant Eco Friendly Ganesh Idol | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ గణేశాయ నమః..! పండుగ పచ్చగా..ప్రకృతి మెచ్చగా..

Aug 18 2025 10:36 AM | Updated on Aug 18 2025 12:22 PM

Ganesh Chaturthi 2025: Plant Eco Friendly Ganesh Idol

గణేశ చతుర్థి సమీపిస్తోంది. నగరంలో ఇప్పటికే వినాయ విగ్రహాల సందడి మొదలయ్యింది.. అయితే నగరవాసుల్లో పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన మట్టి గణపతులవైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది. పండుగ పచ్చగా.. ప్రకృతి మెచ్చగా అన్నట్లు విత్తన గణేశులు తయారీ వైపు అడుగులు వేస్తున్నాయి పలు సంస్థలు. దీనికి తోడు పలు గేటెడ్‌ కమ్యూనిటీలు ‘కలెక్టివ్‌ ఇమర్షన్‌’ కాన్సెప్ట్‌తో ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్, ఇతర పర్యావరణ హాని చేకూర్చే రసాయనాలు, రంగులు అద్దిన విగ్రహాలకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నారు నగరవాసులు. పండుగ సందర్భంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించే దిశగా అడుగులు వేయాలని పర్యావరణ నిపుణులు సైతం సూచిస్తున్నారు.. 

మట్టితో మమేకమయ్యేలా.. 
వినాయకుడు అంటేనే ప్రకృతి హితుడు. ప్రకృతో మమేకమయ్యి జరుపుకునే ఉత్సవమే వినాయక చతుర్థి. పండుగ అర్థం.. పరమార్థం కూడా అదే.. అందుకే వినాయకునికి పెట్టే పత్రి కూడా ప్రకృతికి సంబంధించినవే ఉంటుంది. అందుకే మట్టి గణపతులనే వినియోగించాలని గత కొన్నేళ్లుగా పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా పూర్తిగా పీఓపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌) నివారించకపోయినా.. మెజారిటీ ప్రజలు మట్టి గణపతులనే ఆరాధిస్తున్నారు. 

పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. చాలా మంది పండుగ పచ్చగా.. ప్రకృతి మెచ్చగా అన్నట్లు ప్రకృతి సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఆకులు, పూలతోనే అలంకరణ చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. 

గణేశ చతుర్థి సమీపిస్తోంది. నగరంలో ఇప్పటికే వినాయ విగ్రహాల సందడి మొదలయ్యింది.. అయితే నగరవాసుల్లో పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన మట్టి గణపతులవైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది. పండుగ పచ్చగా.. ప్రకృతి మెచ్చగా అన్నట్లు విత్తన గణేశులు తయారీ వైపు అడుగులు వేస్తున్నాయి పలు సంస్థలు. 

దీనికి తోడు పలు గేటెడ్‌ కమ్యూనిటీలు ‘కలెక్టివ్‌ ఇమర్షన్‌’ కాన్సెప్ట్‌తో ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్, ఇతర పర్యావరణ హాని చేకూర్చే రసాయనాలు, రంగులు అద్దిన విగ్రహాలకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నారు నగరవాసులు. పండుగ సందర్భంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించే దిశగా అడుగులు వేయాలని పర్యావరణ నిపుణులు సైతం 
సూచిస్తున్నారు.. 

మట్టి గణేశ విగ్రహాలు, విత్తన గణేశ విగ్రహాలకు గిరాకీ నగరంలో నిర్వహించే వేడుకల్లో అతిపెద్దది, ప్రధానమైనది వినాయక చతుర్థి. మరికొద్ది రోజుల్లో నగరంలో గణేశ ఉత్సవాల సందడి ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘గ్రీన్‌ గణేశ’ కాన్సెప్ట్‌ తెరపైకి వచి్చంది. గత కొంతకాలంగా పర్యావరణహిత ఉత్సవాలపై అవగాహన పెరిగినప్పటికీ పూర్తిస్థాయి ఎకో ఫ్రెండ్లీ దిశగా నగరం ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా పర్యావరణానికి మేలు చేసేలా విగ్రహాలు, ఉత్సవాలకు సంబంధించిన ఇతర ఉత్పత్తులను, అలంకరణ సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నారు.  

ఆలోచనలు అంకురించి.. 
పర్యావరణం పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన రీత్యా పలు సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మట్టితో తయారు చేసిన విగ్రహాల్లో విత్తనాలను ఉంచుతున్నారు. పండుగ పూర్తయ్యాక వీటిని బయటి చెరువుల్లో నిమజ్జనం చేయాల్సిన పనిలేకుండా పెరడులోనే ఉంచుకునే విధంగా ప్రతిమలను తయారు చేస్తున్నారు. 

మట్టి విగ్రహాలను కుండీల్లో ఉంచి నీరు పోయడం ద్వారా అందులో ముందుగానే ఉంచిన విత్తనాలు మొలకెత్తుతాయి.. ప్రకృతి ప్రేమికులకు అనుకూలంగా వారు మెచ్చే రీతిలో కావాల్సిన విత్తనాలతో వీటిని తయారుచేసి అమ్ముతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ వీటికి ఆకర్షితులవుతున్నారు. కొన్ని సంస్థలైతే వీటికి ఉపయోగించే కుండీలను కూడా సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికే చెక్క, వేర్లు, ఇతర పీచుతో తయారు చేస్తున్నారు. విగ్రహంతోపాటే వీటినీ అమ్మకానికి ఉంచుతున్నారు. 

సామాజిక మాధ్యమాలు, స్వచ్ఛంద సంస్థలు.. 
ఇప్పటికే పండుగ నిర్వహణపై ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు సామాజిక మాధ్యమాలు, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు దీనికి ఊతమిస్తున్నాయి. కొన్ని సంస్థలు పాఠశాలలు, కళాశాలలు, ప్రయివేటు కార్యాలయాల్లో మట్టి ప్రతిమల తయారీపై వర్కషాపులు నిర్వహిస్తున్నాయి. 

సామాజిక మాధ్యమాల్లో సైతం దీనికి సంబంధించిన వీడియోలు విస్తృతంగా చెక్కర్లు కొడుతున్నాయి. ప్రకృతి నుంచి లభ్యమయ్యే వస్తువుల నుంచి కూడా వినాయకుని విగ్రహాలు తయారీ చేసే క్రాఫ్ట్స్‌పైనా శిక్షణనిస్తున్నారు పలువురు ఔత్సాహిక కళాకారులు. మొత్తానికి గ్రీన్‌ గణేశ కాన్సెప్ట్‌ ప్రచారం భారీగానే జరుగుతున్నా.. అమలులో ఏమాత్రం విజయం సాధిస్తామో వేచిచూడాలి అంటున్నారు విశ్లేషకులు.  

కలెక్టివ్‌ ఇమర్షన్‌ వైపు అడుగులు.. 
నగరంలో ఏటా విగ్రహాల నిమజ్జనానికి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. ఈ పరిస్థితి వారం రోజులకు పైగా కనిపిస్తుంది.. దీన్ని సైతం నివారించేందుకు కొన్ని గేటెడ్‌ కమ్యూనిటీలు ‘కలెక్టివ్‌ ఇమర్షన్‌’ వైపు అడుగులు వేస్తున్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీల్లోని ఇళ్లల్లో ఏర్పాటు చేసే ప్రతిమలు మట్టివే ఉండాలని, వీటిని పండుగ పూర్తయ్యాక ఆ కమ్యూనిటీల్లోనే ఒకే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. 

వీరికి అనుకూలంగా స్టార్టప్స్, పర్యావరణ సంస్థలు గ్రీన్‌ గణేశుడి విగ్రహాల తయారీకి ముందుకొస్తున్నాయి. చారి్మనార్, కూకట్‌పల్లి, బేగంపేట వంటి ప్రాంతాల్లో ప్రత్యేక స్టాళ్లు, ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫాంల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. కొన్ని ఎన్‌జీవోలు మట్టి ప్రతిమలను పబ్లిక్‌ ప్రదేశాలు, పార్కులు, మాల్స్‌లో ఉచితంగా అందిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 

ఆలోచనలు అంకురించి.. 
పర్యావరణం పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన రీత్యా పలు సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మట్టితో తయారు చేసిన విగ్రహాల్లో విత్తనాలను ఉంచుతున్నారు. పండుగ పూర్తయ్యాక వీటిని బయటి చెరువుల్లో నిమజ్జనం చేయాల్సిన పనిలేకుండా పెరడులోనే ఉంచుకునే విధంగా ప్రతిమలను తయారు చేస్తున్నారు. మట్టి విగ్రహాలను కుండీల్లో ఉంచి నీరు పోయడం ద్వారా అందులో ముందుగానే ఉంచిన విత్తనాలు మొలకెత్తుతాయి.. ప్రకృతి ప్రేమికులకు అనుకూలంగా వారు మెచ్చే రీతిలో కావాల్సిన విత్తనాలతో వీటిని తయారుచేసి అమ్ముతున్నారు. 

సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ వీటికి ఆకర్షితులవుతున్నారు. కొన్ని సంస్థలైతే వీటికి ఉపయోగించే కుండీలను కూడా సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికే చెక్క, వేర్లు, ఇతర పీచుతో తయారు చేస్తున్నారు. విగ్రహంతోపాటే వీటినీ అమ్మకానికి ఉంచుతున్నారు. 

(చదవండి: మేఘాలయ టూర్‌..! అంబరాన్నంటే అద్భుతం!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement