ఆరోగ్యం గురించి.. ఆనాడే గాంధీ పుస్తకం రాసి మరీ..! | Gandhi Jayanti 2023: Healthy Fitness Lessons To Learn From Gandhiji Lifestyle In Telugu - Sakshi
Sakshi News home page

Gandhi Jayanti 2023: ఆరోగ్యం గురించి.. ఆనాడే గాంధీ పుస్తకం రాసి మరీ..

Published Mon, Oct 2 2023 4:16 PM

Gandhi Jayanti 2023: Fitness Lessons From GandhiJis Lifestyle - Sakshi

ఇవాళ గాంధీ జయంతి మాత్రమే కాదు అంతర్జాతీయ అహింసా దినోత్సవం కూడా. ఎప్పుడూ సత్యం, అహింస అంటూ ప్రతిధ్వనించే గాంధీజీ ఎంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వారు. ఆరోగ్యకరమైన జీవన విధానంపై 'కీ టు హెల్త్‌ బై ఎంకే గాంధీ' అనే పుస్తకంలో ఆనాడే ఎంతో చక్కగా వివరించిన మహాత్ముడు గాంధీజీ. మంచి జీవనశైలి, ఫిట్‌నెస్‌గా ఉండటం ఇవే ఆరోకరమైన జీవితానికి ప్రధానమైనవని బలంగా నమ్మేవారు. ఆయన జయంతి సందర్భంగా గాంధీజీ ఆరోగ్య సూత్రాలు, ఆయన జీవన విధానం గూర్చి తెలుసుకుందామా!

నడక, తాజా కూరగాయాలు, పండ్లు తీసుకోవడం, పొగాకు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం తోపాటు పర్యావరణ పరిశుభ్రత తదితరాలే ఆరోగ్య జీవనానికి వెనుముక అని విశ్వసించేవారు. చాలామంది ఆరోగ్య నిపుణులు గాంధీ ఆరోగ్య సూత్రలనే గట్టిగా విశ్వసించేవారు. ఆ రోజల్లో ప్రబలంగా ఉండే టీబీ, కుష్టువ్యాధి, కలరా, మలేరియా వంటి వ్యాధుల నిర్మూలనకు పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ గురించి గాంధీజీ నొక్కి చెప్పేవారు. ఆయన మరణాంతం వరకు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపటం తోపాటు ధ్యానం, ఫిట్‌ నెస్‌ని ఎప్పుడూ విస్మరించలేదని ఆయన సన్నిహితులు చెబుతుండేవారు. 

గాంధీజీ ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు
గాంధీజీ తన జీవితంలోని తరువాత దశల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలతో భాధపడ్డారు. 1925 నుంచి 1944 వరకు మూడుసార్లు మలేరియా బారినపడ్డారు. 1919, 1924లో అపెండిసెటిస్‌, ఫైల్స్‌  కోసం ఆపరేషన్‌లు చేయించుకున్నారు. ఆయన కొంతకాలం ఊపిరితిత్తుల సమస్యతో కూడా బాధపడ్డారు. ఈ అనారోగ్య సమస్యలే ఆయన్ను ఆరోగ్యకరమైన జీవనన విధానంపై దృష్టిపెట్టేలా చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పోషకమైన ఆహారం, శారీరక ఆరోగ్యం, మంచి నిద్ర అలవాట్లు, సమతుల్య ఆహారం తదితరాలపై దృష్టి పెట్టడమే గాక దాని గురించి పుస్తకం రాసి మరీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

జీవన విధానం..

  • గాంధీజీ ఎప్పుడూ పొలం లేదా స్థానికంగా పండించే పండ్లు, కూరగాయాలే తీసుకునేవారు.
  • అధిక నూనె, ఉప్పు వాడకానికి దూరంగా ఉండేవారు.
  • పిండి పదార్థాలు అధికంగా ఉన్నవాటిని అస్సలు దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు.
  • ఆయన పాలిష్ చేసిన బియ్యం, శుద్ధి చేసిన గోధుమ పిండికి వ్యతిరేకి.
  • ఆయన ఆరోజుల్లోనే తృణధాన్యాల గొప్పతనం, ఫైబర్‌ కంటెంట్‌ గురించి నొక్కొ చెప్పడం విశేషం. 

గాంధీజీ నుంచి నేర్చుకోవాల్సిన ఆహారపు అలవాట్లు..

  • వయస్సుకు తగ్గ విధంగా సమతుల్య ఆహారం తీసుకోవడం
  • వీలైనంతగా తీపి పదార్థాలకు దూరంగా ఉండటం. అంతగా తీపి తినాలనుకుంటే కొద్దిగా బెల్లం ముక్కను తీసుకోవడం
  • తప్పనిసరిగా నడక రోజువారి దినచర్యలో భాగంగా ఉండటం
  • ఇక చివరిగా గాంధీజీ చాలా శక్తిమంతంగా నడిచేవారు. ఎంత దూరం అయినా నడిచే వెళ్లేవారు. ఆయన దాదాపు 40 ఏళ్లు.. రోజూ సుమారు 18 కి.మీ వాకింగ్‌ చేసేవారు. తన రాజకీయ ప్రచార సమయంలో 1913 నుంచి 1948 వరకు అంటే దాదాపు 35 ఏళ్లలో మొత్తం 79వేల కి.మీ నడిచారు. ఇది భూమిని రెండుసార్లు చుట్టి రావడంతో సమానం. కనీసం ఈ గాంధీ జయంతి రోజు నుంచి అయినా మనం ఆయనలాంటి చక్కటి ఆహారపు అలవాట్లను అనుసరిస్తూ.. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం.

(చదవండి: ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూకి..అది జస్ట్‌ ఐదు గ్రాములే చాలట!)

Advertisement
 
Advertisement
 
Advertisement