యూత్ ఫుల్ పవర్ | Forbes India 30 Under 30 2026: Meet our young groundbreakers and trendsetters | Sakshi
Sakshi News home page

యూత్ ఫుల్ పవర్

Jan 11 2026 4:24 AM | Updated on Jan 11 2026 4:24 AM

Forbes India 30 Under 30 2026: Meet our young groundbreakers and trendsetters

రేపు జాతీయ యువజన దినోత్సవం

‘శక్తి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. అది నీలోనే ఉంది’ అని మేల్కొలుపుతూ దారి చూపుతాడు. ‘మీరు ప్రయాణించే మార్గం పదునైన కత్తి అంచులాంటిది. అయినా భయపడకండి. నిస్పృహను వీడండి. గమ్యం చేరే వరకు విశ్రమించకండి’ అంటూ అంతులేని ధైర్యాన్ని ఇస్తాడు.

 ఆ మహానుభావుడు... వివేకానందుడు. ‘స్వామి వివేకానంద’... యువతరానికి ఇష్టమైన పేరు. లక్ష్య సాధనలో వేనవేల ఆయుధాల బలం ఇచ్చే పేరు. రేపు‘జాతీయ యువజన దినోత్సవం’ సందర్భంగా... ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30–2026 జాబితాలో చోటు సాధించిన వివిధ రంగాల యువదిగ్గజాల గురించి....

1.కాజల్‌ బేదా (29) 
అడ్వర్‌టైజింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌
అది కోవిడ్‌ కల్లోల కాలం. ఆ సమయంలో బ్రాండ్‌ స్టోరీ టెల్లింగ్‌ ప్రాధాన్యాన్ని, శక్తిని గ్రహించింది కాజోల్‌ బేదా. 2020లో ముంబైలో మార్కెటింగ్, ప్రకటన ఏజెన్సీ ‘స్క్రిబుల్డ్‌’ను ప్రారంభించింది. యూకేలో మీడియా ్ర΄÷డక్షన్‌లో శిక్షణ తీసుకున్న అనుభవం ‘స్క్రిబుల్డ్‌’ను విజయవంతంగా నడపడంలో ఉపయోగపడింది. ప్రస్తుతం కంపెనీ క్లైంట్లలో నైకా, అదాని గ్రూప్, అమెజాన్‌ ప్రైమ్‌లాంటి పెద్ద బ్రాండ్‌లు ఉన్నాయి.

2. అనీత్‌ పద్దా (26)
ఎంటర్‌టైన్‌మెంట్‌
చిన్నప్పుడు అనీత్‌ పద్దా పెద్దగా మాట్లాడేది కాదు, భావవ్యక్తీకరణ కూడా అంతంత మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని తల్లి ఆమెకు కవిత్వంతోపాటు ఇతర కళలను పరిచయం చేసింది. భావోద్వేగాలు అంటే ఏమిటి? టెక్నిక్‌ అంటే ఏమిటి... లాంటి విషయాలను పరిచయం చేసింది. విశేషం ఏమిటంటే ఏ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేరకుండానే నటన స్వయంగా నేర్చుకుంది అనీత్‌. తనను తాను వ్యక్తపరుచుకోవడానికి అనీత్‌కు కళలు  బలంగా ఉపయోగపడ్డాయి. సైయారా (2025) లో అనీత్‌ అద్భుతపాత్ర ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది.

3. ప్రియా డాలి (29)
డిజైన్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌
క్రియేటివ్‌ డైరెక్టర్‌ అయిన ప్రియా డాలీ డిజైన్, స్టోరీ టెల్లింగ్, కమ్యూనిటీ బిల్డింగ్‌ లాంటి ఎన్నో రంగాలలో పనిచేస్తోంది. ‘సృష్టి మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ’ నుంచి పట్టా పుచ్చుకున్న ప్రియ 2017లో మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘గైసీ ఫ్యామిలీ’లో ఇంటర్న్‌గా చేరింది. ఆ ప్లాట్‌ఫామ్‌ను మల్టీ–ఫార్మట్‌ క్వీర్‌ మీడియా, కల్చరల్‌ సెంటర్‌గా రూపొందించడంలో తన వంతు సహకారం అందించింది. టిండర్, గోద్రెజ్‌లాంటి బ్రాండ్‌ల కోసం పనిచేసింది. క్రియేటివ్‌ స్టూడియో ‘ఆర్‌ యూ సీరియస్‌’ కు ప్రియ డాలి కో–ఫౌండర్‌.

4. పూజా మాలిక్‌ (28
ఫైనాన్స్‌ అండ్‌ ఫిన్‌టెక్‌
పూజా మాలిక్‌ ‘ఈక్విట్రేసర్స్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌’ ఫౌండర్‌. వ్యక్తులు, కుటుంబ సభ్యులు క్లెయిమ్‌ చేయని తమ పెట్టుబడులను తిరిగి పొందడంలో సహాయపడే ఎసెట్‌ రికవరీ సంస్థ ఇది. రికవరీ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా ఉండేలా చూసుకునే లక్ష్యంతో పనిచేస్తుంది. మరచిపోయిన బ్యాంకు డిపాజిట్లు, ఈక్విటి షేర్లు, డివిడెండ్లతో పాటు ఇతర ఆర్థికపరమైన ఆస్తులను ట్రాక్‌ చేయడం, నిజమైన వారసులను గుర్తించడానికి సంబంధించి పనిచేస్తోంది.

5. మౌమితా బసక్‌ (29),
 ఆర్ట్‌
మౌమితా బసక్‌కు భిన్నమైన బెంగాలీ వ్రçస్త కళలు కొట్టినపిండి. సాధారణ వస్త్రాలకే తన కళతో అసాధారణ అందాన్ని తీసుకు వస్తుంది. పాతదుస్తులను ఆకట్టుకునే కళాకృతులుగా తీర్చిదిద్దుతుంది. టీ, కాఫీ రంగులను ఉపయోగించి ప్రత్యేకమైన అల్లికలు సృష్టిస్తుంది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో స్కాలర్‌షిప్‌లు అందుకుంది. అవార్డ్‌లు అందుకుంది. మౌమితా బసక్‌ కళాకృతులు మన దేశంలోని పలు ప్రాంతాలతో పాటు లండన్, స్పెయిన్, పోలాండ్‌లోని గ్యాలరీలలో ప్రదర్శితమయ్యాయి.

6. సిమోన్‌ మోహన్‌ (28)
ఫుడ్‌ అండ్‌ హాస్పిటాలిటీ
‘సొంత ఇంట్లో ఉన్నట్లే హాయిగా ఉంది’ అనే మాట గెస్ట్‌ నోట వినిపించాలనే లక్ష్యంతో మొదలైంది రహో హాస్పిటాలిటీస్‌. ప్రయాణ అనుభవాలను పునర్నిర్వచించాలని సంకల్పించింది. ‘క్వాలిటీ స్టే అంటే కచ్చితంగా ఇదే’ అనేలా చేయాలనుకుంది. సిమోన్‌ మోహన్‌ మాజీ రాజకీయ వ్యూహకర్త. ‘రహో హాస్పిటాలిటీస్‌’ ద్వారా హోమ్‌ స్టే మార్కెట్‌లోకి అడుగుపెట్టిన కొంతకాలానికే అద్భుత విజయం సాధించింది.

7. రమ్య యల్లాప్రగడ (28), 
లక్షయ్‌ సాహ్నీ (28) హెల్త్‌కేర్‌
రమ్య యల్లాప్రగడ, లక్షయ్‌ సాహ్ని 2020లో ‘మార్బుల్‌ హెల్త్‌’ను స్థాపించారు.  న్యూరోటెక్నాలజీ కంపెనీ ఇది. కంపెనీకి సంబంధించి కీలక ప్రాడక్ట్‌ ‘ఈజ్‌’ మన దేశానికి సంబంధించి ఫస్ట్‌ మెడికల్లీ లైసెన్స్‌డ్‌ పోర్టబుల్‌ న్యూరోమాడ్యులేషన్‌ డివైజ్‌. ఈ పరికరాన్ని ఆస్పత్రులలో వినియోగిస్తున్నారు. ‘మార్బుల్‌ హెల్త్‌’ ప్రధానంగా సైకియాట్రిస్ట్‌లు, హాస్పిటల్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఆందోళన, కృంగుబాటు, న్యూరోరిహబిలేషన్స్‌కు సంబంధించి విస్తృత పరిశోధనలు నిర్వహిస్తోంది ‘మార్బుల్‌ హెల్త్‌’.

8.ఆకృతి రావల్‌ (29) 
డీ2సి
తల్లి ప్రేరణతో చేనేత వస్త్రాలపై ఆసక్తి పెంచుకుంది ఆకృతి రావల్‌. ‘హౌజ్‌ ఆఫ్‌ చికంకారి’ పేరుతో వాట్సాప్‌ వేదికగా తన బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ లక్నో చుట్టుపక్కల ఉన్న చేనేత కళకారులతో కలిసి పనిచేస్తోంది. ప్రామాణికమైన చికంకారి దుస్తులను కొనుగోలుదారులకు చేరువ చేస్తుంది. తన బ్రాండ్‌ ద్వారా ఎంతోమంది చేనేత కళాకారులకు స్థిర ఆదాయాన్ని అందిస్తోంది.

9. శీతల్‌దేవి (18)
స్పోర్ట్స్‌
జమ్మూ కశ్మీర్‌లోని మారుమూల పర్వతగ్రామానికి చెందిన శీతల్‌దేవి మన దేశంలోని ప్రసిద్ధ పారా–ఆర్చరర్‌లో ఒకరిగా ఎదిగింది. చేతులు లేకుండా జన్మించిన శీతల్‌దేవిని సంకల్పబలమే విజయపథంలో నడిపించింది. పాదాలను ఉపయోగించి విలువిద్యలో ప్రావీణ్యం సాధించింది. అథ్లెట్‌ కావాలని ఎప్పుడూ కోరుకోని శీతల్‌దేవి పదిహేడు సంవత్సరాల వయసులో మన దేశంలోని అతి పిన్న వయస్కురాలైన పారాలింపిక్‌ పతక విజేతగా, ఆ తరువాత ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

10. ముబస్సిరా ఖాలీద్‌ (26), 
ఫ్యాషన్‌
‘అజ్రాఖ్‌ కళ అనేది పురుషులకు మాత్రమే సాధ్యం అయ్యే కళ’గా పేరు తెచ్చుకుంది. తరతరాల ఈ అప్రకటిత నిర్వచనాన్ని తిరగరాసింది ముబస్సిరా ఖాలీద్‌ ఖత్రీ. ఎన్నో అడ్డంకులను అధిగమించి సంక్లిష్టమైన ఈ సంప్రదాయ కళలో విజయం సాధించింది. సంప్రదాయ అజ్రాఖ్‌ కళారీతులను ప్రీహ్యాండ్‌ పెయింటింగ్, బ్లాక్‌ప్రింటింగ్‌తో  సృజనాత్మకంగా కలిపి విలక్షణమైన డిజైన్‌లను రూపొందించింది. తన బ్రాండ్‌ ‘ఎలిసియస్‌’ను ప్రపంచస్థాయికి తీసుకు వెళ్లాలనుకుంటోంది.

11. గిరిష్‌ మెహతా (27), అనిష శర్మ (27) 
సోషల్‌ ఇంపాక్ట్‌
గిరీష్‌ మెహతా, అనిషా శర్మ కేర్‌ లీవర్స్‌ ఇన్నర్‌ సర్కిల్‌ ఫోరం(సిఎల్‌ఐసి) కో–ఫౌండర్స్‌. కేర్‌లీవర్‌ల కోసం కేర్‌ లీవర్‌ల ద్వారా నిర్వహిస్తున్న ప్లాట్‌ఫామ్‌ ఇది. అనాథాశ్రమాలలో పెరిగిన వీరికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. తమ సోషల్‌ ఇంపాక్ట్‌ ప్లాట్‌ఫామ్‌ కేర్‌ లీవర్స్‌కు (బాలల సంరక్షణ గృహాల నుండి వయోజన జీవితంలోకి అడుగుపెట్టే యువతీ యువకులు) సపోర్ట్‌ ఇస్తుంది. ఓటర్‌ కార్డ్, ఆధార్‌... మొదలైనవి పొందడానికి, ప్రభుత్వ పథకాలు అందించడానికి, స్వయం సహాయ సంఘాలకు సంబంధించి కేర్‌ లీవర్స్‌కు ‘సీఎల్‌ఐసీ’ సహాయం అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement