
ఫుఫు డిష్.. వినడానికి కాస్త వెరైటీగా ఉన్నా.. ప్రస్తుతం నగరంలో ఈ డిష్ ప్రాచుర్యం పొందుతోంది.. ఫుఫు అనేది పశ్చిమ ఆఫ్రికా దేశస్తుల ఫేవరెట్ ఆహారం.. ఆ దేశంలో పుట్టిన ఈ సాధారణ ఆహారం.. కాసావా (కర్రపెండలం), యమ్ లేదా ఆకుపచ్చని అరటి వంటి దుంప కూరగాయలతో తయారు చేస్తారు. ప్రధానంగా కాసావాని యుకా/మానియోక్ అని కూడా పిలుస్తారు. పశ్చిమ ఆఫ్రికాతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇది ప్రధాన ఆహారంగా ఉపయోగంచే పిండి పదార్థాలు కలిగిన దుంప కూరగాయ. దీని శాస్త్రీయ నామం మనిహోట్ ఎసు్కలెంటా. ప్రస్తుతం ఈ వంటకం హైదరాబాద్ నగరంలో ఆఫ్రికా వాసులు నివాసముండే పలు ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో ఆహారప్రియులను అలరిస్తోంది.
ఫుఫు అనే వంటకాన్ని యమ్/ ఆకుపచ్చని అరటి వంటి దుంపను తొక్క(వెరడు) తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి నానబెడతారు.. అనంతరం బాగా ఉడకబెట్టడం ద్వారా దీనిని తయారు చేస్తారు.. దీనిని మిక్సీలో మెత్తగా పిండిచేసి మృదువైన, సాగే ముద్దగా తయారుచేస్తారు.
ఈ మిశ్రమాన్ని పెనంమీదపోసి రుచికి సరిపడా ఉప్పువేసి ఉడికిస్తారు. ఈ వేడివేడి మిశ్రమాన్ని రాగిముద్దలా చేసి చికెన్, మటన్ గ్రేవీ, ఫిష్ గ్రేవీలతో పాటు వెజిటబుల్ గ్రేవీలతోనూ.. సాధారణ సూప్‌లు, సాస్‌చ చిక్కుళ్లు లేదా ఇతర వంటకాలతో పాటు సైడ్ డిష్‌గానూ తింటారు.
పోషక విలువలు...
ఆఫ్రికన్ వాసులకు ఎంతో ఇష్టమైన ఈ ఫుఫు డిష్‌లో అనేక పోషక విలువలు దాగివున్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాయం, విటమిన్–సీ తో కూడిన అనేక విటమిన్లు, ఖనిజాలతో పాటు క్యాలరీలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు పెరగడం, జీర్ణక్రియ, రక్త ప్రసరణకు సహాయపడుతుందట.
అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకారంగా ఉంటుందట. అయితే కాసావాలో సైనోజెనిక్ గ్లూకోసైడ్లు ఉంటాయి. దీనిని సరిగ్గా ఉడికించకపోతే సైనైడ్‌ను విడుదల చేస్తుందట. పూర్తిగా ఉడికించడం వల్ల ఇందులోని టాక్సిన్లు పూర్తిగా నశించి ఆరోగ్యప్రయోజనాలను అందజేస్తుంది.
(చదవండి: