జరీ అంచు ఆభరణం

Fashion with bangles - Sakshi

సంప్రదాయ వేడుకలలో  జరీ అంచు చీరల రెపరెపలు మనకు పరిచయమే.  పువ్వులు, హంసలు, గోపురపు డిౖజైన్లతో అవి అందంగా ఆకట్టుకుంటాయి.  వాటిని అంచు వరకే ఎందుకు పరిమితం చేయాలనే ఆలోచనతో  ఆభరణంగా రూపుకడుతున్నారు డిజైనర్లు.  పాత చీరెల అంచులైనా  కొత్తగా మార్కెట్లో లభించే జరీ బార్డర్స్‌ అయినా  ఇలా మనసుదోచేలా మురిపిస్తున్నాయి.

సంప్రదాయ  వేడుకలు
వేడుకకు తగినట్టు డ్రెస్‌ ఎంపిక ఉంటుంది. దానికి మ్యాచింగ్‌గా ఈ జరీ మాలలు మరింత అందాన్ని తీసుకువస్తున్నాయి. 

ఫ్యాబ్రిక్‌ రోలర్‌
నూలు దారాలను ఉండగా చేసి, వాటికి కట్‌ చేసుకున్న బార్డర్‌ని అతికించి, కావల్సిన పరిమాణంలో ఫ్యాబ్రిక్‌ బీడ్స్‌ను తయారు చేసుకోవచ్చు. 

లాకెట్స్‌తో ప్రత్యేకం
ముగ్గు, గోపురం, దేవతా మూర్తుల లాకెట్స్‌ని ఈ జరీ అంచు చెయిన్స్‌కు జత చేయచ్చు. లేదంటే, బార్డర్‌ ఫ్యాబ్రిక్‌నే లాకెట్‌లా తయారు చేసి, వేసుకోవచ్చు.  

బీడ్స్‌తో జత కట్టి
రంగు రంగుల పూసలను ఎంపిక చేసుకొని, వాటితో జరీ బాల్స్‌ను జత చేసి దండగా సిద్ధంగా చేసుకోవచ్చు. 

గాజుల అందం 
రంగు వెలసిన వెడల్పాటి గాజులను వాడకుండా పక్కన పడేయటం ఇళ్లలో సాధారణంగా జరుగుతుంటుంది. వాటితో జరీ అంచును ఇలా అందంగా తయారుచేసుకోవచ్చు.

1.పాత సిల్క్‌ , జరీ అంచు ఉన్న చీరను ఎంపిక చేసుకోవాలి. జరీ అంచు బాగుంటే, దానిని చీర నుంచి కట్‌ చేసుకోవాలి. 
2. ఎంపిక చేసుకున్న గాజుకు కట్‌ చేసిన జరీ అంచును చుట్టి, అన్నివైపులా గ్లూతో అతికించాలి. 
3. ఎక్కడా జరీ పోగులు బయటకు రాకుండా సరి చూసుకోవాలి.
4. పూర్తిగా గాజు తయారీ పూర్తయ్యాక ఫ్యాబ్రిక్‌ చివర్లు కూడా బయటకు కనిపించకుండా అతికించాలి. 
5. రెండు రకాల గాజు మోడల్స్‌ తయారు చేసుకొని, కాంబినేషన్‌గా ధరించవచ్చు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top