ఇంట్లోనే హోటల్‌ స్టైల్‌.. ఈ వంటకాలు అదిరిపోతాయ్‌! | Easy Indian Recipes Makhana Chaat Veg Lahori Ghevar Poriyal | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే హోటల్‌ స్టైల్‌.. ఈ వంటకాలు అదిరిపోతాయ్‌!

Oct 4 2026 1:07 PM | Updated on Oct 4 2026 1:13 PM

Easy Indian Recipes Makhana Chaat Veg Lahori Ghevar Poriyal

 ఫండే

స్నాక్‌ సెంటర్‌

రోజూ ఒకే రకమైన వంటలతో బోర్‌ కొడుతోందా? అయితే కాస్త కొత్త రుచులను మీ వంటింట్లోకి ఆహ్వానించండి! మఖానా చాట్‌ నుంచి వెర్మిసెల్లి ఘేవర్‌ వరకు.. ఈ వెరైటీ వంటకాలు ఒక్కసారి ట్రై చేయాల్సిందే!

మఖానా చాట్‌..
కావలసినవి..
మఖానా: 2 కప్పులు,
ఉడికించిన ఆలుగడ్డ: 1,
ఉల్లిపాయ: 1,
టొమాటో: 1,
పచ్చిమిర్చి: 1,
కొత్తిమీర: కొద్దిగా,
చాట్‌ మసాలా: టీస్పూన్,
కారం: అర టీస్పూన్,
నిమ్మరసం: టీస్పూన్,
ఉప్పు: తగినంత.

తయారీ..
- ముందుగా పాన్‌లో మఖానా వేసి నూనె లేకుండా క్రిస్పీగా వేయించాలి.
- చల్లారిన తర్వాత చేత్తో కొద్దిగా చిదమాలి.
- ఇప్పుడు ఉల్లిపాయ, టొమాటో, ఆలుగడ్డ, పచ్చిమిర్చి తరగాలి.
- వీటిని మఖానాలో కలపాలి.
- ఉప్పు, కారం, చాట్‌ మసాలా వేసి బాగా కలపాలి.
- చివరగా నిమ్మరసం, కొత్తిమీర చల్లాలి.
అంతే మఖానా చాట్‌ రెడీ! వెంటనే సర్వ్‌ చేస్తే క్రిస్పీగా, రుచిగా ఉంటుంది.

వెజ్‌ లాహోరీ..
కావలసినవి..
కాలీఫ్లవర్‌: కప్పు ముక్కలు,
క్యారెట్‌: 1,
క్యాప్సికమ్‌: 1,
బీన్స్‌: అర కప్పు,
ఉల్లిపాయ: 1,
టొమాటోలు: 2,
అల్లం వెల్లుల్లి పేస్ట్‌: టీస్పూన్,
కారం: అర టీస్పూన్,
గరం మసాలా: అర టీస్పూన్,
ధనియాల పొడి: టీస్పూన్,
ఉప్పు:  తగినంత,
నూనె: 2 టేబుల్‌స్పూన్లు,
కొత్తిమీర: కొద్దిగా.

తయారీ..
- ముందుగా కూరగాయలను చిన్న ముక్కలుగా కోసి కొద్దిగా ఉడికించాలి.
- పాన్‌లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేయించాలి.
- అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి కలపాలి.
- తర్వాత టొమాటో ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి.
- ఇందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేయాలి.
- ఉడికించిన కూరగాయలు వేసి బాగా కలపాలి.
- కొద్దిగా నీరు పోసి 5 నిమిషాలు ఉడికించాలి.
- చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి.
అంతే, హెల్తీ వెజ్‌ లాహోరీ రెడీ!

వెర్మిసెల్లి ఘేవర్‌..
కావలసినవి..
సేమియా: కప్పు,
మైదా: 2 టేబుల్‌స్పూన్లు,
పాలు: అవసరమైనంత,
చక్కెర: కప్పు,
నెయ్యి: టేబుల్‌స్పూన్,
నూనె: వేయించడానికి సరిపడా,
ఏలకుల పొడి, పాలపొడి : కొద్దిగా,
డ్రై ఫ్రూట్స్‌: అలంకరణకు

తయారీ..
- ముందుగా సేమియాను కొద్దిగా వేయించి పక్కన పెట్టాలి.
- మైదాలో పాలు పోసి పలుచటి పిండిలా కలపాలి.
- అందులో సేమియా వేసి కలపాలి.
- కడాయిలో నూనె వేడి చేయాలి.
- సేమియా మిశ్రమాన్ని మధ్యలో రంధ్రం ఉండేలా కొద్దికొద్దిగా పోయాలి.
- బంగారు రంగులోకి వచ్చి క్రిస్పీగా మారే వరకు వేయించాలి.
- మరోవైపు చక్కెర, కొద్దిగా నీటితో పాకం తయారు చేయాలి.
- వేడి ఘేవర్‌పై చక్కెర పాకం పోయాలి.
- పాలపొడి, డ్రై ఫ్రూట్స్‌తో అలంకరిస్తే రుచికరమైన వెర్మిసెల్లి ఘేవర్‌ రెడీ.

చౌచౌ పొరియల్‌
కావలసినవి..
చౌచౌ (బెంగళూరు వంకాయ): 2,
ఉల్లిపాయ: 1,
పచ్చిమిర్చి: 2,
ఆవాలు: అర టీస్పూన్,
మినప్పప్పు: అర టీస్పూన్,
కరివేపాకు: కొద్దిగా,
పసుపు:  చిటికెడు,
ఉప్పు: తగినంత,
నూనె: ఒక టేబుల్‌ స్పూన్‌,
కొబ్బరి తురుము: 2 చెంచాలు.

తయారీ..
- చౌచౌను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
- బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి.
- కట్‌చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించిన తర్వాత చౌచౌ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలపాలి.
- కొద్దిగా నీరు చల్లి మూతపెట్టి మెత్తగా ఉడికించాలి.
- చివర్లో కొబ్బరి తురుము వేసి రెండు నిమిషాలు కలిపితే రుచికరమైన చౌచౌ పొరియల్‌ సిద్ధం.

ఇదీ చదవండి: హైబీపీని అదుపులో పెట్టే పొటాషియమ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement