వావ్‌.. ఈ రైలు అంత దూరం వెళ్తుందా!

Do You Know Which Is The Largest Train In India - Sakshi

మనదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌. ఇది అస్సాంలోని దిబ్రూగఢ్‌ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4,273 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. తొమ్మిది రాష్ట్రాల మీదుగా సాగిపోతుంది. మధ్యలో 56 స్టేషన్‌లలో ఆగుతుంది. దిబ్రూగఢ్‌లో మొదలైన రైలు కన్యాకుమారి చేరడానికి ఐదు రోజులు పడుతుంది. ఇది వీక్లీ ట్రైన్‌.

ట్రావెల్‌ టిప్స్‌: జాగ్రత్తగా వెళ్లి వద్దాం
► టూర్‌కి వెళ్తున్న ప్రదేశం ప్రత్యేకతలను ముందుగా తెలుసుకుని బయలుదేరితే పర్యటనను ఆసాంతం ఆస్వాదించవచ్చు.
► ముఖ్యంగా అక్కడికి మాత్రమే ప్రత్యేకమైన వంటలు, పండ్లు, అక్కడ మాత్రమే దొరికే వస్తువులను మిస్‌ కాకూడదు.
► టూర్‌లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ మాత్రం పూర్తి స్థాయిలో తీసుకోవాలి.


► ఇక రోజంతా ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి.
► టూర్‌కి వెళ్లే ముందు ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించి, డాక్టర్‌ సూచించిన మందులను వెంట తీసుకు వెళ్లాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top