
సాక్షి, సిటీబ్యూరో: సౌందర్య రంగంలో బ్యూటీ కేర్ తప్పనిసరని, నగరంలోని ఈ తరం ఫ్యాషన్ ఔత్సాహికులు వ్యక్తిగత సౌందర్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ప్రముఖ సినీతార దక్ష నగార్కర్ తెలిపారు.
మణికొండ అల్కా పూర్ వేదికగా నూతనంగా ఏర్పాటు చేసిన హెయిర్ అండ్ బ్యూటీ ప్రీమియం సెలూన్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణంలో గ్లామర్ కీలకపాత్ర పోషించిందని, బ్యూటీ కేర్‌తోపాటు ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండటం కూడా తన గ్లామర్ రహస్యమని తెలిపారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల స్టైలిస్ట్ అమ్జద్ హబీబ్ తన సేవలను నగరంలో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని బిజినెస్ హెడ్ ఆపరేషన్స్ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెలూన్ నిర్వాహకులు విజయలక్ష్మి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీచదవండి: Ananya Reddy తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, మార్క్ షీట్ వైరల్
చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన