Dipraj Jadhav: సరదాగా చేసిన ఒక వీడియో స్థాయినే మార్చేసింది.. | Sakshi
Sakshi News home page

Dipraj Jadhav: సరదాగా చేసిన ఒక వీడియో స్థాయినే మార్చేసింది..

Published Fri, Apr 12 2024 9:14 AM

Dipraj Jadhav:

‘అనుకోలేదని ఆగవు కొన్ని’ అంటాడు కవి.
డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ కావాలని దిప్రజ్‌ జాదవ్‌ ఎప్పుడూ అనుకోలేదు. డిజిటల్‌ కంటెంట్‌ క్రియేషన్‌ అంటే ఏమిటో కూడా తెలియదు. సరదాగా చేసిన ఒక వీడియో అతడి స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రముఖ డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా డిజిటల్‌ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది...

ఒక వైరల్‌ వీడియోతో మహారాష్ట్రలోని షిర్పూర్‌ అనే చిన్న పట్టణానికి చెందిన దిప్రజ్‌ జాదవ్‌ జీవితం ఊహించని మలుపు తిరిగింది. మరాఠీ సినిమా ‘లై 
బారి’లోని ఒక డైలాగ్‌ మీమ్‌ మాషప్‌ చేశాడు జాదవ్‌. బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ దృష్టిని కూడా ఆ వీడియో ఆకట్టుకుంది. వైరల్‌ అయింది.
‘ఫేస్‌బుక్‌లో నేను పేజీ స్టార్ట్‌ చేసినప్పుడు కంటెంట్‌ క్రియేషన్‌ అనేది పెద్ద విషయం కాదు. దానికి అంత ్ర΄ాముఖ్యత కూడా లేదు. అలాంటి సమయంలోనే కొత్త కొత్త వీడియోలు చేసేవాడిని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు దిప్రజ్‌ జాదవ్‌.
జాదవ్‌కు సినిమాలు అంటే చాలా ఇష్టం. అందులోని ΄ాపులర్‌ సీన్‌లకు తనదైన స్టైల్‌ జోడించి అనుకరించే వాడు. పుణెలో యానిమేషన్‌ కోర్సు చేస్తున్నప్పుడు వీడియో ఎడిటింగ్‌పై ఇష్టం పెరిగింది.
విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను పర్‌ఫెక్ట్‌గా మిక్స్‌ చేయడంలో గట్టి పట్టు సం΄ాదించాడు. ఆ విద్య అతడికి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో ఎంతోమంది ఫాలోవర్స్‌ను తెచ్చి
పెట్టింది.
సెకండ్‌ టర్నింగ్‌ ΄ాయింట్‌ విషయానికి వస్తే,.,..
రామానంద్‌సాగర్‌ ‘రామాయణం’లోని రాముడు, రావణుడికి మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన వీడియోకు ర్యాపర్‌ డివైన్‌ ΄ాడిన ‘సీన్‌ క్యా హై’ ΄ాటను జోడించాడు. ఇది చూసి మ్యూజిక్‌ ్ర΄÷డ్యూసర్‌ న్యూక్లియ(ఉద్యాన్‌ సాగర్‌) జాదవ్‌ను సంప్రదించి సబ్‌ సినిమా సిరీస్‌లో భాగంగా ఇలాంటి ఫిల్మీ మాషప్స్‌ మరిన్ని కావాలని, వాటిని మ్యూజిక్‌ ్ర΄ోగ్రాంలలో ఉపయోగించుకుంటానని చె΄్పాడు.
జాదవ్‌ క్రియేటివిటీకి న్యూక్లియ బాగా ఇంప్రెస్‌ అయ్యాడు. ‘ఊహకు అందనిది ఆలోచించే సామర్థ్యమే అరుదైన సృజనాత్మకత. ఇలాంటి అరుదైన సృజనకారులలో జాదవ్‌ ఒకరు. రెండు పరస్పర విరుద్ధ అంశాలను మిళితం చేసి అందరినీ ఆకట్టుకుంటాడు’ అంటాడు న్యూక్లియ.
చిత్రపరిశ్రమలో పనిచేయాలనేది జాదవ్‌ కోరిక. బాలీవుడ్‌లోని కొన్ని సినిమాలు, బాట్లా హౌజ్, రాకెట్‌ బాయ్స్‌లాంటి వెబ్‌సిరీస్‌లకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది.
‘నేను చేస్తున్న పని గురించి నా తల్లిదండ్రులకు అవగాహన లేదు. ఏదైన స్థిరమైన ఉద్యోగం చేయాలని కోరుకునేవారు. అయితే నాకు వచ్చిన గుర్తింపు చూసిన తరువాత వారి ఆలోచన మారింది. నాపై నమ్మకం పెరిగింది’ అంటాడు దిప్రజ్‌ జాదవ్‌.
28 సంవత్సరాల జాదవ్‌ ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30–2024’ జాబితాలో చోటు సాధించాడు.
 


కొత్త ద్వారాలు
‘పదిమందిలో ఒకరు’ అని కాకుండా పదిమందికి భిన్నంగా ఆలోచించినప్పుడే మంచి ఫలితం సాధించగలం. ఒక టాపిక్‌ గురించి మనకు ఇష్టం ఏర్పడినప్పుడు దానికి సంబంధించి అన్ని కోణాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఆ 
టాపిక్‌పై పట్టు వస్తుంది. కొత్తగా ఆలోచించడానికి ద్వారాలు తెరుచుకుంటాయి.
– దిప్రజ్‌ యాదవ్, 
డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌

దిప్రజ్‌ జాదవ్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement