సిర్రోసిస్‌తో బాధపడేవారు తీసుకోవాల్సిన ఆహారం

Cirrhosis Diet: What To Eat For Better Management - Sakshi

సిర్రోసిస్‌ అన్నది ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం స్థానంలో అనారోగ్యకరమైన (ఫైబ్రస్‌ స్కార్‌ టిష్యూ) పెరగడం వల్ల వచ్చే సవుస్య. విపరీతంగా వుద్యం తాగేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు... హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, ఫ్యాటీలివర్‌ అనే వ్యాధుల వల్ల కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో దీనికి ఎలాంటి కారణం తెలియకపోవచ్చు కూడా. ఇలాంటి కండిషన్‌ను క్రిప్టోజెనిక్‌ అంటారు.

సిర్రోసిస్‌ వల్ల కడుపులో నీరు చేరడం, కాలేయ–వుూత్రపిండాల సవుస్యలు లాంటి ఎన్నో సవుస్యలు వస్తాయి. సిర్రోసిస్‌ వచ్చినప్పుడు దానివల్ల వచ్చే కాంప్లికేషన్లను బట్టి ఆహార నియవూలు పాటించాల్సి ఉంటుంది. సిర్రోసిస్‌ సవుస్య వచ్చినవాళ్లకు సాధారణ సవుతుల ఆహారం ఇవ్వాలి. అంటే... అన్ని రకాల పోషకాలు సమంగా అందేలా... ఆహారంలో పళ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పాదనలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

లివర్‌ సిర్రోసిస్‌ వచ్చినవాళ్లలో కడుపులో ద్రవాలు చేరడం, కాలేయవాపు, పోర్టల్‌ రక్తనాళంలో ప్రెషర్‌ ఉన్నట్లయితే... అలాంటివారికి ఉప్పు (సోడియం) ఎక్కువగా ఉండే పదార్థాలు ఇవ్వకూడదు. అంటే వారికి ఆహారంలో పచ్చళ్లు, అప్పడాలు, బేకరీ ఐటమ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్‌ (సాల్టెడ్‌ చిప్స్‌), ఉప్పులో వేయించిన జీడిపప్పు (సాల్టెడ్‌ నట్స్‌), సాస్‌లు, జామ్‌లు వంటివాటిని పూర్తిగా అవాయిడ్‌ చేయాలి. సిర్రోసిస్‌వల్ల హెపాటిక్‌ ఎన్‌కెఫలోపతి అనే వూనసిక సవుస్య వస్తే నాన్‌వెజిటేరియన్‌ ప్రోటీన్స్‌ ఇవ్వడం సరికాదు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top