Jaggery Amazing Benefits: బెల్లం వాష్ చేయండి! ముఖం మీది ముడతలకు చెక్ పెట్టండి!

ముడతలకు బెల్లం వాష్
బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే కారకాలే కాదు.. అందాన్ని ఇనుమడింపజేసే గుణాలు కూడా ఉన్నాయి. బెల్లంతో తయారు చేసిన ఫేస్ వాష్ యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముడతలను తగ్గిస్తుంది. బెల్లంతో పాటు శనగపిండి, పెరుగు కలిపి తరచుగా ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇలా చేయండి!
►చిన్న బెల్లం ముక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి, టీస్పూను నీళ్లుపోసి మరిగించాలి.
►బెల్లం కరిగిన తరువాత టీస్పూను శనగపిండి, టీస్పూను పెరుగు వేసి చక్కగా కలుపుకోవాలి.
►ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఏడు నిమిషాలపాటు గుండ్రంగా మర్దన చేయాలి.
►ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
►ముఖాన్ని పొడిగా తుడుచుకుని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ రాసుకోవాలి.
►ఈ ఫేస్‌వాష్‌ను వాడడం వల్ల ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది.
►వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుముఖం పడతాయి.
చదవండి: Benefits Of Tamarind Syrup: చింతపండు సిరప్‌ను ముఖానికి రాసుకున్నా, నేరుగా తాగినా సరే! అద్భుత ప్రయోజనాలు!
Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే!
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు