Health Tips: రక్తపోటు అదుపులో ఉండాలంటే ఈ రెండు కలిపి తినండి..!

Banana With Curd Reduces High Blood Pressure Says Health Journals - Sakshi

పెరుగు అంటే అదో ప్రో–బయాటిక్‌ ఆహారం అన్న సంగతి తెలిసిందే. ఆధునిక వైద్యవిజ్ఞానం ఈ విషయాన్ని నిరూపణ చేయడానికి చాలా ముందునుంచీ... అంటే అనాదిగా పెరుగు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. తోడేసిన పాలు పెరుగుగా మార్చడానికి ఉపయోగపడే... మనకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే ప్రోబయాటిక్స్‌ రక్తపోటు (హైబీపీ)ని అదుపుచేయడానికి సమర్థంగా ఉపయోగపడతాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. 

అంతేకాదు... ఈ విషయం ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశోధనల్లోనూ తేలిందని, ఇదే విషయం ‘హైపర్‌టెన్షన్‌’ అనే హెల్త్‌జర్నల్‌లోనూ ప్రచురితమైందని పేర్కొంటున్నారు. అందుకే పులవడానికి సిద్ధంగా ఉన్న పిండితో వేసే అట్లు, ఇడ్లీతో పాటు తాజా పెరుగు, తాజా మజ్జిగ రక్తపోటును సమర్థంగా అదుపు చేస్తాయన్నది వైద్యవర్గాల మాట. అంతేకాదు... చాలామందికి అరటిపండుతో పెరుగన్నం తినడం ఓ అలవాటు. అరటిలో పొటాషియమ్‌ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పెరుగన్నం, అరటి కాంబినేషన్‌ రక్తపోటు అదుపునకు స్వాభావికంగా పనికి వచ్చే ఔషధం లాంటిది అంటున్నారు వైద్యనిపుణులు, న్యూట్రిషన్‌ నిపుణులు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top