అంబానీ ఫ్యామిలీ ఫోటో అదిరిందిగా : ఫోటోలు వైరల్‌ | Anant Radhika prewedding Ambani future generation and Family Potrait goes viral | Sakshi
Sakshi News home page

అంబానీ ఫ్యామిలీ ఫోటో అదిరిందిగా : ఫోటోలు వైరల్‌

Mar 8 2024 2:16 PM | Updated on Mar 8 2024 3:32 PM

Anant Radhika prewedding Ambani future generation and Family Potrait goes viral - Sakshi

అంబానీ  నెక్ట్స్‌ జనరేషన్‌ లీడర్లు,  ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’, ఫోటోలు వైరల్‌ 

రిలయన్స్‌అధినేత ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె, అనంత్‌  ప్రేయసి  రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకులు  ఘనంగా ముగిసాయి. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ  వేడుకలు జరిగాయి. 

అంబానీ పెద్దకోడలు, ఆకాశ్‌ భార్య   శ్లోకా అంబానీ మన దేశం నెక్స్ట్ జనరేషన్ లీడర్లు ఒకే ఫ్రేమ్‌లో అంటూ ఈ ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. జామ్‌నగర్‌లో డిన్నర్‌ సందర్భంగా  తీసుకున్న ఫోటోకి ఆకాష్, శ్లోక ఇషా, ఆనంద్, అనంత్, రాధికల బెస్ట్‌ ఫోటో అనే క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు కమెంట్‌ చేశారు. రిలయన్స్‌  అంబానీ కుటుంబం రేపటి తరం అంటూ సోషల్‌ మీడియా పోస్ట్‌లు వైరల్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ మూవీ ‘హమ్‌ సాథ్‌ సాథ్‌  హై’  పోస్టర్‌తో  పోస్టింగ్‌లు  వెల్లువెత్తాయి. 

మరోవైపు ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ ఫౌండర్‌ చైర్మన్‌గా ఉన్న ఎన్‌ఎంఏసీసీకి చెందిన ట్విటర్‌ ఖాతా కూడా వేడుకలు ఘనంగా ముగిసాయి అంటూ ట్వీట్‌ చేసింది. దీనికి సంబంధించి  రెండు ఫోటోలను కూడా షేర్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement