దుర్వాసన లేకుండా బాత్‌రూమ్‌ శుభ్రంగా ఉంచుకోండిలా! లేదంటే అతిథులు యాక్‌ అంటూ పారిపోతారు మరి..

Amazing Tips Steps For Clean And Neat Bathroom Follow These - Sakshi

మీది బాత్‌రూమా? యాక్‌ రూమా?

చాలామందికి ఒంటి మీద ఉన్నంత శ్రద్ధ పాదాల మీద ఉండదు. అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచి వస్తువులను అందంగా అమర్చుకోవడంలో ఉన్న తీరిక, ఓపిక బాత్‌రూమ్‌కి వచ్చేసరికి ఉండవు.

అయితే బాత్‌రూమ్‌ శుభ్రంగా లేకపోతే బెడ్‌రూమ్, డ్రాయింగ్‌ రూమ్, లివింగ్‌ రూమ్, హాలు ఎంత నీట్‌గా ఉన్నా ప్రయోజనం లేదు. అందుకని ఇంటి శుభ్రత ఎంత ముఖ్యమో,  బాత్‌రూమ్‌ శుభ్రత కూడా అంతే ముఖ్యం. ఇంతకీ బాత్‌రూమ్‌ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో తెలుసుకుందామా మరి!

సాధారణంగా మనకి ఎన్నో పనులు ఉంటాయి. వాటిలో పడిపోయి మనం బాత్రూమ్‌ని శుభ్రం చేయడం మరిచిపోతాం. మిగిలిన రూమ్‌లన్నిటికన్నా బాత్‌రూమ్‌ తొందరగా ఖరాబవుతుంది. అందుకని వీలైనప్పుడల్లా బాత్రూంని శుభ్రం చేయడం పట్ల శ్రద్ధ పెట్టడం అవసరం.

ఎప్పుడు వీలుంటే అప్పుడు బాత్రూంని శుభ్రం చేయడం ఎంతో అవసరం. కానీ కుదిరినప్పుడు కాస్త ఓపిక చేసుకుని క్లీన్‌ చేసుకుంటూ ఉంటే దుర్వాసన లేకుండా శుభ్రంగా ఉంటుంది బాత్రూమ్‌. 

చెత్తాచెదారం లేకుండా 
బాత్రూంని శుభ్రంగా ఉంచాలన్నా, దుర్వాసన లేకుండా ఉండాలన్నా, ముందుగా బాత్‌రూమ్‌లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవడం అవసరం. బాత్‌రూమ్‌లో పేరుకుపోయే చెత్తాచెదారం ఏమిటా అనుకుంటున్నారా... ఖాళీ అయిపోయిన షాంపూ ప్యాకెట్లు, సబ్బు కవర్లు, రేజర్‌ బ్లేడ్లు వంటివి. వీటన్నింటినీ  ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసుకోవడం మరచిపోకండి. ఇలా చేస్తేనే బాత్రూమ్‌ని నీట్‌గా ఉంచుకునేందుకు వీలవుతుంది. కనుక ఈసారి నుండి తప్పనిసరిగా ఇలా అనుసరించండి.

ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌/ డిఫ్యూజర్‌ వాడకం
బాత్రూమ్‌ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే బాత్‌రూమ్‌లో ఒక చిన్న డిఫ్యూజర్‌ ఉంచాలి. దీనివల్ల  బాత్రూమ్‌ నుంచి మంచి వాసన వస్తుంటుంది. ఈ చిన్న డిఫ్యూజర్‌ని సింకు వెనక పెడితే, ఈ డిఫ్యూజర్‌ మంచి వాసన వెలువడేట్లు చేస్తుంది.

డిఫ్యూజర్‌ పెట్టుకునే వీలు లేనివారు ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌ను బాత్రూమ్‌లో పెట్టడం వల్ల కూడా మంచి వాసన వస్తుంది. మీరు మీ బాత్రూంలో మీకు నచ్చిన చోట వీటిని పెట్టొచ్చు. 

తడిసిన తువ్వాళ్లు వద్దు 
కొంతమంది ఒళ్లు తుడుచుకుని తడీపొడీ టవల్‌ను బాత్‌రూమ్‌లోనే పడేసి వస్తుంటారు. అలాగే అండర్‌వేర్లు, బనీన్లు కూడా బాత్‌రూమ్‌లోనే వదిలేస్తుంటారు. నిజానికి మాసిన బట్టల కన్నా తడిబట్టల నుంచి, తడీపొడి బట్టల నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది. తడి బట్టలు కానీ మాసిన బట్టలు కానీ బాత్రూంలో ఉంచడం వల్ల దుర్వాసన వస్తుంటుంది కాబట్టి వాటిని తొలగిస్తూ ఉండండి. 

సబ్బులు 
మంచి సువాసన వచ్చే సబ్బుల్ని బాత్రూంలో పెట్టడం వల్ల మంచి వాసన వస్తుంది. కాబట్టి వీటిని ఎంపిక చేసుకుని బాత్రూంలో పెట్టండి ఇది కూడా మీ బాత్రూమ్‌ని బాగా ఉంచడానికి సహాయ పడుతుంది.

టాయిలెట్‌ ట్యాంక్‌లో డిటర్జెంట్‌ 
లాండ్రీ డిటర్జెంట్‌ని మీరు మీ టాయిలెట్‌ ట్యాంక్‌లో వేయొచ్చు ఇది కూడా మంచి వాసన వచ్చేలా చేస్తుంది. ఫ్లష్‌ చేసినప్పుడు సెంటెడ్‌ వాటర్‌ వస్తాయి. 

హెర్బ్స్‌ వాడకం 
బాత్రూంలో హెర్బ్స్‌ ఉపయోగించడం మంచి ఐడియా. పైగా ఇవి ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. మన బడ్జెట్‌లోనే వీటిని మనం బాత్రూంలో తెచ్చి పెట్టొచ్చు. లావెండర్‌ లేదా మింట్‌ని బాత్రూంలో పెట్టవచ్చు. దీనివల్ల మంచి వాసన వస్తుంది. లేదంటే ఎండిపోయిన యూకలిప్టస్‌ని బాత్‌రూమ్‌లో హ్యాంగ్‌ చేసి ఉంచితే చాలు... దుర్గంధాన్ని వదలగొట్టి మంచి వాసన వచ్చేలా చేస్తుంది. 

ఈ చిట్కాలను అనుసరిస్తే మీరు మీ బాత్‌రూమ్‌ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. హాయిగా కూనిరాగాలు తీసుకోవచ్చు. లేదంటే అతిథులు ఎవరైనా వస్తే యాక్‌ అని వాంతి చేసుకుని పారిపోతారు జాగ్రత్త!

చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే..
Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top