గుండెపోటులో మొదటి గంటే కీలకం..

After Heart Attack First Hour Is Most Crucial. - Sakshi

న్యూఢిల్లీ: శరీరంలో అతి ప్రధానమైన భాగం గుండె. అందువల్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేదంటే మరణాన్ని చేరువయినట్లే, కాగా గుండె పోటు(హార్ట్ఎటాక్‌)లో మొదటి గంటే కీలకమని డాక్టర్ జైనులాబేదిన్ హందులే  చెబుతున్నారు. హార్ట్ ఎటాక్ అంటే, గుండెకు రక్త నాళాల ద్వారా జరిగే రక్త సరఫరాలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు గుండె నొప్పి వస్తుంది. దీంతో ఆక్సీజన్‌తో కూడిన రక్తం గుండెకు చేరుకోకపోవడంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. డాక్టర్ హందులే  ముఖ్య సూచనలు.. మెజారిటీ గుండెపోటు కేసులలో కొన్ని గంటల తర్వాతనే పేషెంట్‌ను ఆసుపత్రికి తీసుకొస్తున్నారని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని తెలిపారు. గుండెపాటు వచ్చిన మొదటి గంట తర్వాతనే శరీరానికి రక్త ప్రసరణ ఆగిపోతుందని, అందుకు గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్‌ అవర్‌ అంటారని డాక్టర్‌ పేర్కొన్నారు. కాగా ఎవరికైనా చాతిలో కొంచెం నొప్పి లేదా ఇబ్బందిగా ఉన్న డాక్టర్లను సంప్రధించి ఈసీజీ టెస్ట్‌ చేయించుకోవాలని తెలిపారు.

అయితే కొందరి చాతిలో నొప్పి వస్తే అసిడిటీ, జీర్ణ సమస్యలుగా భావిస్తారని డాక్టర్లు తెలిపారు. కానీ డాక్టర్‌ను కచ్చితంగా సంప్రదించాలని, ముఖ్యంగా వారి కుటుంబంలో(జన్యు పరంగా) ఎవరికైనా గుండె సమస్యలుంటే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం గుండెపోటు మరణాలు అకస్మాత్తుగా అవుతున్నందు వల్ల సడెగ్‌గా గుండెపోటు వస్తుందని ప్రజలు భావిస్తున్నారని, కానీ గుండెపోటు వచ్చే వారిలో శరీరం అనేక సంకేతాలు ఇస్తుందని డాక్టర్‌ తెలిపారు.

అయితే కొందరు వ్యక్తులలో గుండె పోటు లక్షణాలు ఉండవని, ముఖ్యంగా చాతిలో కొద్దిగా నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. గుండెపోటు సమస్య రాకుండా ఉండాలంటే క్రమశిక్షణ పరమైన జీవన విధానం, వ్యాయామం చేయడం, మధ్యపానానికి దూరంగా ఉండడం, సిగరెట్‌, పొగాకు ఉత్పత్తులకు దూరం ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top