
2025లో ఆసియాలోని 50 ఉత్తమ రెస్టారెంట్ల యొక్క విస్తరించిన జాబితాలో 7 భారతీయ రెస్టారెంట్లు స్థానం పొందాయి. 2025లో ఆసియాలోని ఉత్తమ రెస్టారెంట్ల సంకలనం 51వ నుండి 100వ స్థానంలో ఉంది. ఇటీవల విడుదలైంది. ఏడు భారతీయ సంస్థలు దీనిలో చోటు దక్కించుకున్నాయి.
ఈ 50 బెస్ట్ రెస్టారెంట్‌ల జాబితాలో ఏడు భారతీయ సంసథలు చోటు దక్కించుకున్నాయి. ఈ రెస్టారెంట్‌ల అవార్డుల ప్రదానోత్సవం ఆవిష్కరణ ఈ నెల ఆఖరున సియోల్ జరగనుంది. ఆ జాబితాలో చోటు దక్కించుక్ను ఏడు భారతీయ రెస్టారెంట్లు వరుసగా కసౌలిలోని నార్ (66వ స్థానం), బెంగళూరులోని ఫార్మ్‌లోర్ (68వ స్థానం), ముంబైలోని అమెరికానో (71వ స్థానం), న్యూఢిల్లీలోని ఇంజా (87వ స్థానం), ముంబైలోని ది టేబుల్ (88వ స్థానం), న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ (89వ స్థానం), ముంబైలోని ది బాంబే క్యాంటీన్ (91వ స్థానం).
అంతేగాదు ముంబైలోని ది టేబుల్ రెండోసారి ఈ జాబితో నిలిచింది. గతంలో ఈ లిస్ట్‌లో నిలవడమేగాక "వన్ టు వాచ్ " అవార్డుని కూడా దక్కించుకుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నార్, ఫార్మ్‌లోర్, ఇంజా రెస్టారెంట్‌లు తొలిసారిగా చోటు దక్కించుకున్నాయి. ఇక తొలిస్థానంలో సియోల్‌లోని బోర్న్ అండ్ బ్రెడ్ నిలిచింది.
మొదటి పది స్థానాలలో బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్ సియోల్‌కి సంబంధించిన ఆరు రెస్టారెంట్లు ఉండటం విశేషం. కాగా, గతేడాది ఐదు భారతీయ రెస్టారెంట్లు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం దక్కించుకోగా ఈ ఏడాది మరో రెండు రెస్టారెంట్లు ఈ జాబితాలో చేరడం విశేషం.
(చదవండి: మత్స్యకారుడి కూతురు జలక్రీడల్లో సత్తా చాటుతోంది..!)
Comments
Please login to add a commentAdd a comment