న్యూస్‌రీల్
డివిజన్ల వారీగా పోలింగ్
ముంపు ముప్పులోనే..
వరుస తుపాన్లు, భారీ వర్షాలతో తణుకు మండలంలో దువ్వ, అత్తిలి మండలంలోని పలు గ్రామాలు ఇంకా ముంపు ముప్పులోనే ఉన్నాయి. 8లో u
మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పల్లె పోరుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలతో ప్రారంభమైన స్థానిక సంస్థల హడావుడి కొనసాగుతూనే ఉంది. ఈనెల 13న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు కానుండటంతో పల్లెల్లో కోలాహలం మొదలైంది. రిజర్వేషన్ల ఖరారుతో ప్రారంభించి అభ్యర్థుల ఎంపిక వరకూ తీవ్ర కసరత్తు ప్రారంభమైంది. జిల్లాలో 544 పంచాయతీల్లో 5,696 వార్డు ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
మూడు దశల్లో..
జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 13, 16, 19 తేదీల్లో నోటిఫికేషన్ జారీ చేసి ఈనెల 26, 29 వచ్చే నెల 2న పోలింగ్ నిర్వహించేలా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఖరారైన గ్రామ పంచాయతీల రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ప్రధానంగా జిల్లాలో షెడ్యూల్ ఏరియాల్లోని (ఎస్టీ)లకు మహిళలకు 31, జనరల్ 32 కలిపి 63 పంచాయతీల్లో రిజర్వేషన్ ఖరారైంది. అలాగే పూర్తి గిరిజన తండాలుగా రెండు గ్రామాలను రిజర్వేషన్ ఖరారు చేసి, ఒకటి మహిళలకు, ఒకటి జనరల్‌గా ప్రకటించారు. అలాగే ఎస్టీ రిజర్వేషన్‌లో 6 పంచాయతీలను గుర్తించి మహిళలకు 2, జనరల్ 4 స్థానాలు ఖరారు చేశారు. అలాగే ఎస్సీ కేటగిరీలో 65 జనరల్, 56 మహిళల పోటీ చేసేలా 121 గ్రామ పంచాయతీలు కేటాయించారు. బీసీలకు సంబంధించి 52 జనరల్, 52 మహిళలకు మొత్తంగా 104 గ్రామ పంచాయతీలు ఖరారు చేశారు.
అలాగే అన్ రిజర్వుడు కేటగిరీలో 124 మహిళలకు, 122 జనరల్ పంచాయతీలుగా ఎంపిక చేసి 246 గ్రామ పంచాయతీలు అన్ రిజర్వుడుగా ప్రకటించారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 12,92,238 మంది పల్లె ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మొదటి విడతలో ఈనెల 26న జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో, రెండో విడతలో ఈనెల 29న ఏలూరు డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో, మూడో విడతలో నూజివీడు డివిజన్‌లోని 8 మండలాల్లోని పంచాయతీల్లో ఎన్నికల కౌంటింగ్, అదేరోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది.
పంచాయతీ పోరుకు సై
13న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు
రిజర్వేషన్లు ఖరారు
544 పంచాయతీలు.. 5,696 వార్డులు
26న తొలి విడత పోలింగ్


