వైఎస్సార్‌సీపీ శ్రేణుల పోరాటం అద్భుతం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ శ్రేణుల పోరాటం అద్భుతం

Nov 10 2026 12:55 AM | Updated on Nov 10 2026 12:55 AM

పండుగ పూట విషాదం వైఎస్సార్‌సీపీ శ్రేణుల పోరాటం అద్భుతం

పండుగ పూట విషాదం
దీపావళి పండుగ రోజున ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 8లో u
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

బుట్టాయగూడెం: స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ అణచివేతలు, బెదిరింపులను ఎదుర్కొంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు అద్భుత పోరాటం చేశారని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. సోమవారం బుట్టాయగూడెంలో ఆయన విలేకరలుతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడా నిష్పక్షపాతంగా జరగలేదని, సీఎం చంద్రబాబు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలను పూర్తిగా హైజాక్‌ చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం కీలుబొమ్మలా మారిందని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గట్టిపోటీనిచ్చి పలు స్థానాలను కై వసం చేసుకున్నారన్నారు. అయితే కొన్నిచోట్ల తమ అభ్యర్థుల ఫలితాలను రీకౌంటింగ్‌ పేరుతో బలవంతంగా తారుమారు చేసి, టీడీపీ అభ్యర్థులను గెలిచినట్టు ప్రకటించడం దారుణమని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు వై ఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారని, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో లేదా సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని బాలరాజు డిమాండ్‌ చేశారు. పార్టీ విజయం కోసం ప్రాణాలకు తెగించి సైనికుల్లా కష్టించిన నాయకులు, కార్యకర్తలకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ విజేతలకు అభినందనలు, పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలను బాలరాజు తెలిపారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement